Search
Wednesday, September 19, 2012
Wednesday, September 5, 2012
టీచర్స్ డే
ఈ రోజే గురుపూజోత్సవం
విద్య వేర్పిన గురువులను స్మరించుకునే రోజు.
మన దేశ రాష్ట్రపతి దివంగత డా || సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు. టీచర్స్ డే!
అనేక విశ్వ విద్యాలయాలల్లో పని చేసిన వీరు ఉపాధ్యా వృతి కే కలికి తురాయిగా వున్నారు.
వీరు రెండో భారత రాష్ట్రపతిగా 1962 నుంచి 1967 వరకు మొదటి ఉప రాష్ట్రపతిగా 1952 నుంచి 1962 వరకు వున్నారు. యునివర్సిటి ఆఫ్ కలకత్తాలోను ఆక్స్ ఫోర్డ్ యునివేర్సిటి లోను ప్రోఫేసర్ గాను పని చేసారు.
ఉపాధ్యాయ వృతిలో వున్న వీరి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ రోజున టీచర్స్ డే గా జరుపుకుంటున్నాము. వీరి స్నేహితులు, సన్నిహితులు వీరి జన్మ దినాన్ని జరుప తల పెట్టినపుడు వీరు
"Instead of celebrating my birthday. It would be my proud privilege if 5 September is observed as Teachers' Day" అని సమాధానం ఇచ్చారు. అప్పటి నుంచి టీచర్స్ డే ని జరుపుకుంటున్నాము
వీరిని భారత రత్న అవార్డు 1954 లో వరించింది.
వీరి కలం నుంచి ఎన్నో అధ్బుత కల ఖండాలు వెలువడ్డాయి.
కొన్ని సూక్తులు, కొటేషన్స్
Quotes
http://www.youtube.com/watch?v=awH7qyf_aVY&feature=related
ఉపాధ్యాయుడు తన గురుతర బాధ్యతలో భాగంగా విద్యార్ధులలో విజ్ఞానం తో పాటు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మానవతని, మంచిని, త్యాగాన్ని , ఉద్బోధించాలి . విద్యార్ధులు తమ తెలివి తేటలతో ఏ చిన్న పని చేసిన మెచ్చుకోవాలి. కించపరచకూడదు. తోటివారితో పోలుస్తూ అవమానించకూడదు. టీచర్ విద్యార్ధులకి మంచికి ఆదర్శం గా వుండాలి అలాగని చెడు అలవాట్లలో కాదు.
ఆదర్శవంతుల జీవితాలని బోధించాలి .
ఇదివరకు బతకలేక బడిపంతులు అనేవారు. నేడు ఆ నానుడికి అర్ధం మారిపోయింది. ఉపాధ్యాయులు అంటే సమజాన్ని నడిపించే దిక్సూచి వంటి వారు. నేటి విద్యార్ధులే రేపటి పౌరులు మొక్కని సరైన పాదు తీసి నీరు పోసి పెంచితే చక్కటి పూలని, ఫలాలని అందిస్తుంది. అలాగే విదుర్దులను చిన్నప్పుడే సరైన తోవలో నడిపిస్తే వారి భవిష్యత్తు పూల బాటగా మారుతుంది.
కొంతమంది విద్యార్ధులే తమ టీచర్స్ పై దాడి చేస్తున్న సంఘటనలు పేపర్స్ లో టి వి లలో చూస్తున్నాం.
గురు బ్రహ్మ: గురు విష్ణు : గురుదేవ్వో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః
అన్న అర్ధాని రూపు రేఖలు మార్చికొందరు ఆకతాయులు గురువుల పై తిరగబడే సంఘటనలు జరగటం నిజంగా శోచనీయం.
అలాగే కొన్ని చోట్ల గురువుకి అర్థం మార్చేస్తూ టీచర్నే ప్రేమలోకి దింపే ప్రభుద్దులు తయారవుతున్నారు. వాటికీ తోడూ అలాటి సినిమాలు రావటం చూస్తుంటే ఈ సమాజ పోకడలు ఎటు పోతున్నాయో అని అనిపిస్తుంది.
ఈ రోజు డా సర్వేపల్లి రాధాకృష్ణన్ మన దేశానికి ఒక పౌరుడిగా, రాష్ట్రపతిగా , ఉపాధ్యాయుడుగా, విద్యావిధాన నిర్దేశ కుడిగా, దెశ భవితని, కీర్తి ప్రతిష్టలని నలు దిశల నడిపిన వ్యక్తి జన్మ దినం జరుపుకుంటున్నాం .
వారి బాటలో ప్రతి ఉపాధ్యాయుడు నడిస్తే నిజంగా మన దేశం నందనవనం గా మారుతుంది.
ప్రభుత్వం ప్రతి ఏట అందించే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులని ఈ సంవత్సరం కూడా నూరు మందికి పైగా అవార్డులు ప్రకటించింది
నగరం లోని పలు సంస్థలు కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకుంటున్నాయి.
ప్రతివ్యక్తి జీవితంలో గురువు లేనిదే మనుగడ లేదు.
గురువంటే స్చూల్లో చదువు చెప్పే గురువు కాదు. తల్లి తొలి గురువయితే, విద్య నేర్పే గురువు తరువాత జీవితంలో ప్రతి ఒక్కరు తెలీని విషయం చెప్పే వారు అందరు కూడా గురువులే. ఈ రోజు ఇలా గురువులని స్మరించుకోవడం దేశమంతా అందరు తమకి జ్ఞానం నేర్పిన వారిని గుర్తు చేసుకోవటం నిజంగా సుదినం.
విద్య వేర్పిన గురువులను స్మరించుకునే రోజు.
మన దేశ రాష్ట్రపతి దివంగత డా || సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు. టీచర్స్ డే!
దేశవ్యాప్తంగా ప్రతి స్కూల్ లోను విధ్యా ర్ధులు తమ టీచర్స్ ని సన్మానించుకునే రోజు.
అటు ప్రభుత్వం కూడా ఉత్తమ ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగ సన్మానించి అవార్డులతో సత్కరిస్తుంది.
విద్యార్ధులు కూడా ఆ రోజు ( 5, సెప్టెంబర్ ) నాడు తమ టీచర్స్కి సెలవిచ్చి తాము తమ ఇష్టమైన టీచర్ లాగా తయారయ్యి classes తీసుకుంటారు. అలా టి విద్యార్ధులకి ఉత్తమ బహుమతులు ఇవ్వటం, టీచర్స్ కి ఆటల పోటీలు, ఇతర పోటీలు నిర్వహించి బహుమతులు అందచేస్తారు.
డా || సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ముఖ చిత్రంతో కూడిన స్టాంప్ లను ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది.5, సెప్టెంబర్, 1888 న తమిళనాడు లోని తిరుత్తణి లో జన్మించారు డా సర్వేపల్లి. భారతీయ అధ్యాత్మిక వేత్తా అయిన వీరాస్వామి, సీతమ్మ దంపతులు వీరి తల్లి తండ్రులు. రాదా కృష్ణన్ శి వ కాముని తన పదహారు సంవత్సరాల ప్రాయం లో వివాహం చేసుకున్నారు. వీరికి 5 కుమార్తెలు, 1 కొడుకు సంతానం. వైస్ చాన్సులేర్ ఆఫ్ ఆంధ్ర యు నివెర్సిటి లో 1931 నుండి 1936 వరకు వున్నారు. బనారస్ హిందూ ఉనివెర్సితి లోను వైస్ చాన్స్ లర్ గాను వున్నారు.
అనేక విశ్వ విద్యాలయాలల్లో పని చేసిన వీరు ఉపాధ్యా వృతి కే కలికి తురాయిగా వున్నారు.
వీరు రెండో భారత రాష్ట్రపతిగా 1962 నుంచి 1967 వరకు మొదటి ఉప రాష్ట్రపతిగా 1952 నుంచి 1962 వరకు వున్నారు. యునివర్సిటి ఆఫ్ కలకత్తాలోను ఆక్స్ ఫోర్డ్ యునివేర్సిటి లోను ప్రోఫేసర్ గాను పని చేసారు.
ఉపాధ్యాయ వృతిలో వున్న వీరి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ రోజున టీచర్స్ డే గా జరుపుకుంటున్నాము. వీరి స్నేహితులు, సన్నిహితులు వీరి జన్మ దినాన్ని జరుప తల పెట్టినపుడు వీరు
"Instead of celebrating my birthday. It would be my proud privilege if 5 September is observed as Teachers' Day" అని సమాధానం ఇచ్చారు. అప్పటి నుంచి టీచర్స్ డే ని జరుపుకుంటున్నాము
వీరిని భారత రత్న అవార్డు 1954 లో వరించింది.
వీరి కలం నుంచి ఎన్నో అధ్బుత కల ఖండాలు వెలువడ్డాయి.
కొన్ని సూక్తులు, కొటేషన్స్
Quotes
| "It is not God that is worshipped but the authority that claims to speak in His name. Sin becomes disobedience to authority not violation of integrity." |
| "Reading a book gives us the habit of solitary reflection and true enjoyment." |
| "When we think we learn we cease to know." |
| "A literary genius, it is said, resembles all, though no one resembles him." డా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర పై యు ట్యూబ్ లో చిన్న క్లిప్పింగ్ కింద లింక్ లో చూడచ్చు. |
http://www.youtube.com/watch?v=awH7qyf_aVY&feature=related
ఉపాధ్యాయుడు తన గురుతర బాధ్యతలో భాగంగా విద్యార్ధులలో విజ్ఞానం తో పాటు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మానవతని, మంచిని, త్యాగాన్ని , ఉద్బోధించాలి . విద్యార్ధులు తమ తెలివి తేటలతో ఏ చిన్న పని చేసిన మెచ్చుకోవాలి. కించపరచకూడదు. తోటివారితో పోలుస్తూ అవమానించకూడదు. టీచర్ విద్యార్ధులకి మంచికి ఆదర్శం గా వుండాలి అలాగని చెడు అలవాట్లలో కాదు.
ఆదర్శవంతుల జీవితాలని బోధించాలి .
ఇదివరకు బతకలేక బడిపంతులు అనేవారు. నేడు ఆ నానుడికి అర్ధం మారిపోయింది. ఉపాధ్యాయులు అంటే సమజాన్ని నడిపించే దిక్సూచి వంటి వారు. నేటి విద్యార్ధులే రేపటి పౌరులు మొక్కని సరైన పాదు తీసి నీరు పోసి పెంచితే చక్కటి పూలని, ఫలాలని అందిస్తుంది. అలాగే విదుర్దులను చిన్నప్పుడే సరైన తోవలో నడిపిస్తే వారి భవిష్యత్తు పూల బాటగా మారుతుంది.
కొంతమంది విద్యార్ధులే తమ టీచర్స్ పై దాడి చేస్తున్న సంఘటనలు పేపర్స్ లో టి వి లలో చూస్తున్నాం.
గురు బ్రహ్మ: గురు విష్ణు : గురుదేవ్వో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః
అన్న అర్ధాని రూపు రేఖలు మార్చికొందరు ఆకతాయులు గురువుల పై తిరగబడే సంఘటనలు జరగటం నిజంగా శోచనీయం.
అలాగే కొన్ని చోట్ల గురువుకి అర్థం మార్చేస్తూ టీచర్నే ప్రేమలోకి దింపే ప్రభుద్దులు తయారవుతున్నారు. వాటికీ తోడూ అలాటి సినిమాలు రావటం చూస్తుంటే ఈ సమాజ పోకడలు ఎటు పోతున్నాయో అని అనిపిస్తుంది.
ఈ రోజు డా సర్వేపల్లి రాధాకృష్ణన్ మన దేశానికి ఒక పౌరుడిగా, రాష్ట్రపతిగా , ఉపాధ్యాయుడుగా, విద్యావిధాన నిర్దేశ కుడిగా, దెశ భవితని, కీర్తి ప్రతిష్టలని నలు దిశల నడిపిన వ్యక్తి జన్మ దినం జరుపుకుంటున్నాం .
వారి బాటలో ప్రతి ఉపాధ్యాయుడు నడిస్తే నిజంగా మన దేశం నందనవనం గా మారుతుంది.
ప్రభుత్వం ప్రతి ఏట అందించే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులని ఈ సంవత్సరం కూడా నూరు మందికి పైగా అవార్డులు ప్రకటించింది
నగరం లోని పలు సంస్థలు కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకుంటున్నాయి.
ప్రతివ్యక్తి జీవితంలో గురువు లేనిదే మనుగడ లేదు.
గురువంటే స్చూల్లో చదువు చెప్పే గురువు కాదు. తల్లి తొలి గురువయితే, విద్య నేర్పే గురువు తరువాత జీవితంలో ప్రతి ఒక్కరు తెలీని విషయం చెప్పే వారు అందరు కూడా గురువులే. ఈ రోజు ఇలా గురువులని స్మరించుకోవడం దేశమంతా అందరు తమకి జ్ఞానం నేర్పిన వారిని గుర్తు చేసుకోవటం నిజంగా సుదినం.
Labels:
టీచర్స్ డే
Location:
3900 Rd, Independence, KS 67301, USA
Thursday, August 2, 2012
RAKSHA BANDHAN
RAAKHEE
అన్నా చెల్లెళ్ళ బంధానికి గుర్తుగా రక్షా భందన్ ఈ రోజే . వెళ్లి పోతోంది కొద్ది నిముషాలో.
ఏంతో మంది అన్న చెల్లెళ్ళు తమ ప్రేమ గుర్తుగా రాఖీ కట్టించుకునే సంప్రదాయం ఇప్పుడు ఎక్కువగా ఉంటోంది.
మా చిన్నపుడు ఈ పండుగలు ఏమి లేవు. కానుకలు పుచుకోవ టా లు, రాఖీలు కట్టడాలు లేవు.
ఎప్పుడైనా ప్రేమగా ఒక చీరో, గాజులో ఇస్తే గొప్ప. (కొద్ది మంది ఇళ్ళల్లో మాత్రమే సుమా) కొంతమంది భారీగా కానుకలు ఇస్తుంటారు. అనుకోండి.
అన్నట్లు ఇవాళ ఇంకో ముఖ్యమైన పండుగ శ్రవణ పౌర్ణమి కూడా. అతివలందరికి ఏంతో ముఖ్యమైన పండుగ కూడా.
రక్షా బంధనం మన పురాణాల లో కూడా వుందని తెలుస్తోంది.
ఇంద్రుదు, కృష్ణుడు ఇలా దేవతలు కూడా రాఖీ కట్టారుట
యేన బద్దో బలీ రాజా దాన వేంద్రో మహా బలా
తేనత్వా మాభి బద్నామి రక్షే మా చల మా చల
ఈ మంత్రాని పఠిస్తూ రాఖీ కడతారు.
'
కాని ప్రస్తుతం మాత్రం ప్రతి ఇంట ప్రతి చెల్లి (అక్క) తమ అన్నలు (తమ్ముళ్ళకి) రాఖీలు కట్టటం వేడుకగా మారింది.సోదరి సోదరుని నుదుట తిలకం దిద్ది, చేతికి రక్షగా రాఖీ కట్టి తీపి తినిపిస్తుంది.
దానికి సోదరుడు తమ చెల్లెలి మేలు కోసం ఏమైనా చేయటానికి సిద్దం అంటూ ఆమెకి పసుపు కుంకుమలు కానుకగా ఇస్తాడు.
జంధ్యాల పౌర్ణమి
జంధ్యాలు ధరించే వారు నూతన జంద్యాని ధరిస్తారు. వెడాలు చదవటం చేస్తారు. నాలుగు వేదాల ను ఆరంభ ఋక్కులను చివరి ఋక్కులను వేద పండితులు పఠి స్తారు. పాత జంధ్యాలను తీసివేసి కొత్త జంధ్యాలను (యగ్నోపవీతాల ను) ధరిస్తారు.
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ......
Aum Yagnopaveetham Paramam pavithram prajapatheyatsahjam purastat|
Ayushya magyam pratimanch Shubram yagnopavitam balamustu Tejah|
yagnopavithamaci yagnasya tva yagnopavithenopanhyami||
ఈ రోజు హయగ్రీవ జయంతి కూడా.
ఇలా ఎన్నో పండుగల కలయికే ఈ శ్రావణ పౌర్ణమి
Wednesday, July 18, 2012
Rajesh Khanna
రాజేష్ ఖన్నా ఇక లేరు. సూపర్ స్టార్ హిందీ సిని రొమాంటిక్ హీరో రాజేష్ ఖన్నా ఇక లేరు. బాలీవుడ్ సూపర్ స్టార్ 69 ఖన్నా బుధవారం మధ్యాహ్నం తన ఇంట్లో (ఆశిర్వాద్) కన్నుమూసారు. కాన్సెర్ తో బాధపడ్దారు. వారికి డిం పుల్ కపాడియా మాజీ భార్య సేవలు చేసారు. ప్రముఖ హీరో ఆక్షయ్ ఖన్నా అల్లుడు ట్విన్ కిల్ ఖన్నా భర్త. మరో కూతురు రింకీ మనుమలు, మనుమరాండ్రు బంధువులు మధ్య రాజేష్ ఖన్నా చివరి శ్వాస తీసుకున్నారు. మన దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన సంతాపాన్ని వెలిబుచ్చారు .
1969 - 1970 వారు నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్. ఆరాధనా, కటిపతంగ్ వంటి సినిమాలు ప్రేక్షకుల మదిలో
ఇప్పటికి చెరగని ముద్ర వేసుకున్నాయి. 1942 డిసెంబర్ 29 న జన్మించిన రాజేష్ ఖాన్న దత్తత వెళ్లారు. అయన అసలుపేరు జతిన్ ఖన్నా. తన పేరును రాజేష్ గా మార్చుకున్నారు. ఆఖరి కథ చిత్రం ద్వారా రాజేష్ ఖన్నా తెరపై అడుగు పెట్టిన ఆరాధనా చిత్రం ఆయనని హీరోగా నిలబెట్టింది. గాయకుడు కిశోరే కుమార్ పాడిన పాటలు అన్ని హిట్ అయ్యాయి. దాదాపు 30 చిత్రాలకు పైగా వీరి కాంబినేషన్ లో వాచ్చాయి. మూడు సార్లు బెస్ట్ హీరో అవార్డు ని అందుకున్నారు. వరుసగా పదిహేను చిత్రాల్లో నటించి సూపర్ హిట్ చేసిన ఘనత వీరికే దక్కింది. లోక్ సభ సభ్యుడిగా 1992 - 96 వరకు తన సేవ లందించారు.
Sunday, July 8, 2012
Hindi Bhajans
అందరి మనసులు దోచుకున్న అలనాటి హిందీ భజనలు
Bhajan by Lata Mangesker
Jyothi se Jyoti se.. Lathaji
Aye Malik Tere.....
Monday, July 2, 2012
గురు పూర్ణిమ
గురు పూర్ణిమ
vyas bhagavan
గురు పూర్ణిమగా వ్యవహరిస్తారు. పూర్వ కాలం లో గురుకులం లో శిక్షణ ఇచేవారు. పూర్తి అయిన శిష్యులు గురు దక్షిణ సమర్పించుకోవటం, గురుపూజ చేయటం చేసేవారు.
vyas bhagavan
ఈ రోజు గురు పూర్ణిమ. గురువులని పూజించే రోజు. గురు పూజోత్సవం
వ్యాస భగవానుడు జన్మించిన రోజుగా భావించే ఈ రోజుని వ్యాస్ పూర్ణిమ అని గురు పూర్ణిమ అని అంటారు.
"గురు బ్రహ్మ గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పరబ్రహ్మ: తస్మైశ్రీ గురవే నమ:
ఒక వ్యక్తి జీవితం లో గురువు యొక్క ప్రాముఖ్యతని తెలుపుతుంది ఈ శ్లోకం. ఆషాడ శుక్ల పక్షం నాడు వచ్చే పూర్ణిమని
| Vyasa Mandir at Haridwar |
ఫలం పుష్పం, తోయం, ధనం, ధ్యాన్యం వస్త్రం ఇలా ఏదైనా గురువుకి సమర్పించుకోవచ్చు. ఈ రోజు గురువు వందనం చేసి ఆశీర్వాదాలు పొందాలి. మనకి విద్య నేర్పిన గురువు ఎవరైనా సరే భక్తితో నమస్కరించాలి. జ్ఞానం ఇచ్చిన వారెవరైనా సరే, వయసులో చిన్న అయిన సరే, జీవిత సోపానం లో మనకి తెలియంది తెలియ చెప్పిన గురువు ఎవరైనా సరే వందనం అర్పించాల్సిందే!
శిష్యుని మదిలో భక్తిని ప్రేరేపించి, మానవత్యాన్ని మేల్కొలిపి, మానసిక అందోళనలని పోగొట్టి శిష్యుని మేలు కోరేవాడు గురువు.
ఈ రోజు గురు వ్యాస దేవుడు మహాభారతాన్ని రచించాడు. పద్దెనిమిది పురాణాలు, భగవత్ గీత, బ్రహ్మసుత్రాలు మీమాంస అనే వి కూడా రచించిన ఆది గురువు.
పరాశర మహర్షి పుత్రుడు వ్యాసుడు.
రైతన్నలకు ఈ మాసం లో పడి తొలకరి చినుకులు వారి భవిష్యత్తుకి పునాదులు. వరి నాట్లు నాటే సమయం. ముందుగ ఈ రోజు పుడమి తల్లిని పుజిస్తారు. నాగలి పట్టి పొలం పనులు చేపడుతారు.
విద్యార్ధులు తమ టీచర్స్ కి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి
వ్యాస మహర్షి
Monday, June 11, 2012
Thursday, June 7, 2012
"కలర్స్ అఫ్ జాయ్"
"కలర్స్ అఫ్ జాయ్"
Art of living International Centre, బెంగళూరు లో జరిగిన యూత్ ఈవెంట్ కలర్స్ అఫ్ జాయ్ పై రాసిన ఆర్టికల్
http://www.suryaa.com/main/features/Article.asp?category=4&subCategory=1&ContentId=84273
Wednesday, May 30, 2012
"కలర్స్ అఫ్ జాయ్"
మిత్రులందరికీ
స్వాగతం... సుస్వాగతం!!
మొట్ట మొదటి సరిగా బెంగుళూరు శ్రీ శ్రీ ఆశ్రమం లో జరగబోతున్న ప్రత్యేక కార్యక్రమం:
"కలర్స్ అఫ్ జాయ్"
మే 31 నుండి జూన్ 3 , 2012 వరకు జరగ బోయే ఈ ప్రత్యెక కార్య క్రమంలో శ్రీ శ్రీ రవి శంకర్ గారు స్వయంగా పాల్గొనే ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో విలువైనది. ఈ విశేష కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి 2 ,000 మంది పైగా చిన్నారులు పాల్గొంటున్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 200 యూత్ పాల్గొంటున్నారు. దీనిని బట్టే ఈ workshop ఎంత ప్రాధాన్యతని సంతరించుకుంటుందో తెలుస్తోంది
ముఖ్యంగా యూత్ ని ఉద్దేశించి నిర్వహించే ఈ కార్యక్రమం యువతకి ఎంతో ఉపయోగం.
ఈ వర్క్ షాప్ ... ART excel, YES!, YES 2! participants కోసం నిర్దేసించబడింది.
ఈ వేసవి లో సాధారణంగా తల్లి తండ్రులు తమ పిల్లలన్ని ఏదో వొక విధంగా వారి సమయాన్ని గడపడానికి ప్రత్యేక వేసవి శిబిరాలని ఆశ్రయిస్తుంటారు. వాటి ద్వారా పిల్లలు జ్ఞానం సంపాదించినా ఆటలు మొదలైన వాటి వాళ్ళ అలసి పోతుంటారు.నేటి చదువుల మానసిక వత్తిళ్ళ నుంచి దూరం కావటానికి, మానసికోత్సాహం పెంపొందటానికి పిల్లల కోసమే రూపొందించిన ఆర్ట్ అఫ్ లివింగ్ వారు చేపట్టిన బృహత్తర కార్యక్రమమే ఈ "కలర్స్ అఫ్ జాయ్ "విస్తారమైన ప్రదేశంలో చుట్టూ ఇదు కొండల నడుమ, చక్కని అందమైన సరస్సు, సహజమైన ప్రక్రుతి వాతావరణం లో ఈ కార్యక్రమం జరుగుతోంది. శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఆశిస్సులతో నడిచే ఈవెంట్ ఎంతో అద్భుతం. అమోఘం.ఈ ఆర్ట్ ఎక్సెల్ లో ధ్యానం మరియు పరస్పర అవగాహనా ద్వారా పిల్లల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి పెరగటం జరుగుతుంది. వారిలో సృజనాత్మక శక్తి అభివ్రుది చెందుతుంది. ఏకాగ్ర త పెరుగుతుంది. స్నేహశీలత పెంపొందుతుంది. ప్రతిరోజూ ప్రతి విద్యార్ధి ఎదురుకునే మానసిక ఆందోళన దూరం అవటం, ఆత్మ విశ్వాసం పెరగటం ద్వారా వారు విజయం వేపు అడుగులు వేయగలుగుతారు.యువత కి సంబంధిచిన YES వర్క్ షాప్ లో వారిలో యువ శక్తి ని అధికం చేస్తుంది. ప్రత్యేకమైన శ్వాస పద్ధతుల ద్వారా వారి ఆందోళనలు దూరమవటం, మదిలో చెలరేగే negetive emotions , (చెడు భావోద్రేకాలు ) దూరమవుతాయి.YES 2 ...YES పూర్తి చేసుకున్న వారికోసం నిర్దేసించబడినది అ dynamic vibrant వర్క్ షాప్. భాద్యతలు, సమస్యలని అర్ధం చేసుకోవటం, తన పై నమ్మకం ఏర్పరచుకోవడం (సెల్ఫ్ కాన్ఫిడెన్సు ) మొదలైనవెన్నో ఈ వర్క్ షాప్ ద్వారా ఏర్పరచుకో గలుగుతారు.ఈ నాలుగు రోజుల "కలర్స్ అఫ్ జాయ్" కార్యక్రమం లో meditation, యోగ వంటివే కాదు....సుభాషితాలు చెప్పటం, గీత బోధించటం, పురాణ గాధలు వినిపించటం, ఆశ్రమం విహారాలు, హస్త కళలు నేర్పించటం, సహజ వాతావరణం లో పెరిగే పంటలు గురించిన దర్శనం, వివరణ, గోశాల దర్శనం, ప్రత్యేకించి భారత మాట గొప్పతనం ,,, ఇలా ఎన్నో విషయాలపై చర్చలతో పాటు శ్రీ శ్రీ రవి శంకర్ గారు సన్నిధిలో ఈ వర్క్ షాప్ జరగటం నిజం గా ప్రతి విద్యార్ధి అదృష్టం.
ఇందులో పాల్గొన్న కొందరి యూత్ అభిప్రాయాల వీడియో క్లిప్పింగ్స్.....
Tuesday, May 29, 2012
"సత్య మేవ జయతే"
Satyameva Jayathe Telugu
"సత్య మేవ జయతే" ఇటీవల ఎంతోమందిని ఆలోచింపచేసే టివి ప్రోగ్రాం
హిందీ లో ప్రసారమయిన దాన్ని తెలుగులో వచ్చింది. దాన్ని ఆసక్తి కలవారు చూడగలరు.
తెలుగు కన్నా హిందీ లో ఒరిజినల్ వెర్షన్ బాగుంది.
Satyameva Jayathe Hindi
సమాజంలో ఎంతో పవిత్రమైన వృత్తిలో వున్న కొంతమంది డాక్టర్లు, హాస్పిటల్స్ అమాయకులపై నేటి సమాజంలో
చేసే అన్యాయం పై ఈ ఆదివారం 27 5 12 నాడు star plus లో వచ్చిన కార్యక్రమం ఇది.
లింక్ మీద క్లిక్ చేయండి
-- Thursday, May 17, 2012
సనాతనం మన హిందూ ధర్మం
శ్రీ పీఠం ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ రహస్య ప్రవచానాల కార్యక్రమం నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆ సందర్భంలో ఆర్ష విద్య గురుకుల వ్యవస్తాపకులు అయిన దయానంద సరస్వతి స్వామి ఇటీవల నగరానికి విచ్చేసినపుడు పరిపూర్ణనంద స్వామిజి జగద్గురు వైభవం పేరిట దివ్య పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ దయానంద సరస్వతి స్వామిజి కి శృంగేరి శారదాపీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ఆదిశంకర గౌరవపురస్కారాన్ని అందచేసారు. ఆ సందర్భంగా పరిపూర్ణనంద స్వామిజి తమ గురువుతో పాటు ఆర్షగురుకులంలో సన్యాస దీక్ష పొందిన తెలుగు వారైన 13 స్వామీజిలను వేదిక మీదకు ఆహ్వానించి గౌరవంగా సత్కరించారు.
ఈ సందర్భం గా ఆనాటి సభలో స్వామిజి ఆంగ్ల ప్రసంగానికి తెలుగులో పరిపూర్ణనంద స్వామిజి తర్జుమా చేసి అందరికి వినిపించారు.
" అనాది నుంచి ఈ భూమి మీద ఎన్నో మతాలున్నాయి. కానీ అందులో కొన్ని మతాలూ అంతరించి పోయాయి పూర్వకాలంలో కూడా ఒక తీవ్ర తరమైనటు వంటి భావ జాలంతో తన ఉనికిని చాటుకునే దిశగా ఎన్నో మతాలూ ఈ భూమి మీద పాలన చేసాయి. వాటిల్లో కొన్ని లేవు. . కానీ ఇటీవల కొన్ని కొత్త మతాలూ వచ్చాయి అవన్నీ తన మనుగడకి తమ ఉనికిని చాటుకోవడం కోసం అవన్నీచాలా తీవ్ర తరంగ ఒక రకంగా ఉగ్ర రూపం ధరించి విస్తరించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ భూమ్మీద సనాతన మైనటువంటి ఈ హిందూ ధర్మం లేనటువంటి రోజు లేదు . సనాతనమైన ఈ ధర్మం అప్పుడు, ఇప్పుడు ఉంది . ఎప్పటికి ఉంటూనే వుంటుంది అందుకే సనాతనం అని అన్నారు.
ఈ భూమ్మీద సైన్సు అనేది ఒకప్పుడు పుట్టలేదు. భూమితో పాటే ప్రక్రుతి తో పాటే సైన్సు అనేది పుట్టింది. ఆ సైన్సు అనేది ఏ సైంటిస్ట్ కానీ పెట్టింది కాదు. ప్రక్రుతి ఆవిర్భావం నుంచే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఆ విషయం ఇప్పుడు న్యూ టన్ చెప్ప్పాడు. అలాగే వైజ్ఞానిక దృక్పధంతో విజ్ఞాన వేత్తలు కనుగునే ఒక్కొక్క సారం కూడా ప్రకృతిలో అనాదిగా ఉన్న విషయాలనే చెపుతున్నారు.
సైన్సు కొత్త కాదు. అలాగే మన వేదాలు కానీ హిందూ వాగ్మయాలు కానీ ఎవరు పుట్టించింది కాదు. ఇది కాలంతో పాటు అనాది నుంచి వస్తుంది. కానీ సైన్సు కి వాగ్మయాలుకి వున్నాచిన్న తేడా ఏమిటంటే . సైన్సు కి పది ఏళ్ళ క్రితం ఒక సైంటిస్ట్ ఒక ఫార్మలా చెపితే ఇరవై ఏళ్ళ తరువా త ఇంకో సైంటిస్ దాని మర్చి ఇంకా ఉన్నతమైనది గా మార్పులు చేస్తూ ఉంటాడు. నలభై ఎళ్ళ తరువాత రక రకాలుగా మార్పులు చేస్తూ వుంటాడు ఇలా బెటర్ మెంట్ పొందు తూనే వుంటుంది సైన్సు. కానీమన వేదం శాస్త్రంలో 'అహం బ్రహ్మస్మి తత్మ్వమసి' అనే వాక్యం చెప్పిన తరువాత దాన్ని మార్చే మతం లేదు బెట్టేర్మేంట్ చేసే వ్యాక్యం వుండదు.. అదే సైన్సు కి మన వేదాంతానికి వున్నా తేడా. వేదాలు తర తరాల నుంచి అలానే ఉంది దాన్ని మార్పులు చేయలేము. భగవంతుడు ఎక్కడో లేదు. ఆణువణువూ ప్రకాశిస్తున్నాడు అనే సత్యాన్ని మనం ఆచరించి చూపిస్తున్నాం.
మన సంప్రదాయం లో ఆలోచిస్తే రుద్రం లో ఒక వ్యాక్యం ఉండి. నమస్తే అస్తు భగవాన్ .అంటే పరమాత్మా నీకు నమస్కారం అని. మనం ఎవరైనా కనిపిస్తే నమస్తే అంటాం భగవంతునికి, ఒక వ్యక్తిని వేరుగా చూడని ఏకైక సనాతన హిందూ ధర్మం మనది. ఇతర మతాలలో దేవుడు వేరు, వ్యక్తీ వేరు. కానీ మన భారత దేశం లో ఆవిర్భ వించిన సనాతన ధర్మం ఏదైతే వుందో అది ఒక్కటే భగవంతుని, వ్యక్తిని వేరుగా కాకుండా సమైక్య దర్సనంగా చూప గలిగే శాస్త్రం హిందూ ధర్మం మాత్రమే. అటువంటి హిందూ ధర్మం లో పుట్టమంటే అది మన భాగ్యం.
చేపలకి నీటిలో వుంటూ మునిగి పోకుండా ఎలా ఉండాలో తెలుసు. చేప నీటిలో ఉంటేనే బతుకుతుంది. బయట పడితే మరణిస్తుంది. దాని ఉనికి కోల్పోతుంది అలాగే మనం హిందువుగా బతికున్నంత కాలం ఈ భారత భూమిలో మనకి మనుగడ. ఉనికి నిలబడాలంటే హిందువుగానే జీవించాలి. ఒక హిందువు మాత్రమే తన ధర్మాన్ని మతాన్ని పరి రక్షించుకుంటూ ఇతర మతాలని కూడా బ్రతక నివ్వగలిగే యోగ్యతా ఒక్క హిందూ మతానికి ఉంది.
ఒక హిందువు క్రైష్టవులకి, ముస్లిములకి , నాస్తికుడికి వ్యతిరేకి కాదు. వాటి వాటి ఉనికిని పరి రక్షించగలిగే మతం హిందూ మతం. మనం అటువంటి సనాతన ధర్మంలో పుట్టాం జీవిస్తున్నాం అటువంటి సంస్కృతిలో పుట్టాం.,
మనం ఒక రాయికి మొక్కుతున్నాము అంటే ఆ రాయి లో వున్నది సాక్షాత్తు ఆ శ్రీ మన్నారాయణునుడే అనే భావనతో వుండటం వల్లే. అలాగే
మనం పసుపుకి నీరు చేర్చి ముద్దగా చేర్చి గణపతిగా ఆరాధిస్తాం, ఆవాహయామి అని పూజ అంత చేసిన తరువాత ఆ పసుపు ముద్దని తిరిగి పులుసు వంటి వంటల్లో ఉపయోగించం. కారణం, ఆ పసుపుని మనం గణపతిగా భావి స్తున్నాం కనుక. మన భావనలో, భావుకతలో పరమాత్మే నిండి వున్నాడు. ఇటువంటి గొప్ప సంస్కృతి మనది. " అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
వారు తన ప్రసంగంలో సనాతనమైన మన హిందూ ధర్మాన్ని గురించి వివరించారు.
శ్రీ దయానంద సరస్వతి స్వామిజి కి ఆరోగ్యం సరిగా లేకున్నా కోయంబత్తుర్ నుంచి మన నగరానికి విచ్చేసి మన జంట నగరాల వాసులకు తమ అనుగ్రహ భాషణం తో అలరించారు. ఆరోజు ఉదయం కూడా వారు తమ ఆశ్రమం లో పండితులకి సంస్కృత పాఠాలు తీసుకుని వచారు. వారికి వేదాలంటే ఎంతో మక్కువ. వేదాలే వారి ఊపిరి, ఆహరం, నీరు కూడా... స్వామి దయానంద ఎందఱో శిష్యుల్ని తయారు చేసారు. పరిపూర్ణనంద స్వామి నిర్వహించే లలితా సహస్రనామ జ్ఞాన యజ్ఞం చూసి వారు ఆనందంతో ఆనాటి సభలో తాను కూడా పరిపూర్నానంద నయ్యనని అన్నారు.
Thursday, May 10, 2012
jiddu krishnamurthy
ప్రముఖ తత్వవేత జిడ్డు కృష్ణ మూర్తి జన్మ దినం
ప్రముఖ తత్వ వేత్త శ్రీ జిడ్డు కృష్ణ మూర్తి మే, 11 1895 మదనపల్లి లో జన్మించారు. సంజీవమ్మ నారాయణ దంపతుల అష్టమ సంతానం వీరు.
పది సంవత్సరాల వయసులో తల్లి మరణించింది. వీరు చిన్న తనం లోనే తండ్రి, తమ్ముడు నిత్య నందాతో పాటు మద్రాస్ నగరం లో దివ్య జ్ఞాన సమాజంలో నివసించేవారు. ఆ సమాజానికి అధ్య క్షు రాలైన డా. అనీబి సెంట్, లెడ్ బీటర్ అనే ముఖ్య మైన వ్యక్తి ఆడుకుంటున్న కృష్ణమూర్తి లో దివ్య తేజస్సు వుందని గుర్తించారు. వీరే తమ మాస్టర్ కాగలరని వీరిలో దివ్య శక్తులున్నాయని, వీరే తమ సమాజానికి కాబోయే గురువని గుర్తించారు. అన్నతమ్ములిద్దరిని లండన్ పంపించారు. కృష్ణ మూర్తి గారిని దత్త తీసుకున్నారు.
వీరికి అన్ని రంగాల్లో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు.
అనీ బీసెంట్ కృష్ణ మూర్తి గారిని తల్లిలా ఆదరించింది. ప్రేమగా లాలించింది. గురువులా శిక్షణ అందించింది.
కృష్ణమూర్తి దివ్య జ్ఞాన సభలకి హాజరవటం, హెరాల్డ్ పత్రికని నడపటం, తారా పరిషద్ నిర్వహించటం చేసేవారు. కొలది కాలం లోనే కృష్ణమూర్తి దివినె సొసైటీ వుంచి వైదొలగి విస్తృతంగా ప్రపంచం అంటా తన పర్యటన సాగించి ఉపన్యాసాలిచ్చెవారు.
"హృదయానికి ప్రేమ, మేధకు తెలివి ఉన్నాయి ఈ రెండు సమ పాళ్ళలో పెరిగినపుడు సంపూర్ణ వికాసం సిద్ధించి మనిషిని పూర్ణ మానవునిగా తీర్చి దిద్దుతుంది. హృదయం సత్సంబంధాలు కలిగిస్తుంది. సంబంధమే జీవితం. ప్రతి వ్యక్తి కి సమాజం పట్ల బాద్య త వుంది." అని అనేవారు.
కృష్ణమూర్తి గారిని కృష్ణాజి అనేవారు. హాలండ్ డెన్మార్క్, ఫ్రాన్సు, మొదలైన ఎన్నో దేశాలు చుట్టి వచ్చే వారు. గంభీరమైన తన కంఠం తో ఉపన్యాసా
లిచ్చేవారు .
కాలిఫోర్నియా లోని ఒహై వాలి లో ఆర్య విహార్ అనే ఆశ్రమం నిర్మించుకున్నారు.
కృష్ణ మూర్తి యోగిలా మారారు. అధిక సమయం meditation లో వుండేవారు.
రోజులు నెలలు గడిచాయి... జ్ఞానోదయమైంది తేజస్సు వెలుగొంద సాగింది.శక్తి పెరిగింది.
జిడ్డు కృష్ణ మూర్తి దివ్య జ్ఞా న సమాజ స్వర్నోత్శావాలకు మద్రాస్ నగరానికి వచ్చారు. ఆ సమయం లో తమ్ముని మరణ వార్త తెలిసింది.
తమ్ముని మరణ వార్త తొలుత క్రుంగ దీసినా. శక్తి పుంజుకొని, జీవితాన్ని ఎదుర్కొన్నాడు. దివినె సొసైటీ స్వర్ణోత్సవ సభలో కృష్ణాజి ప్రపంచ బోధకుడు అయ్యాడని అనిబిసెంట్ ప్రకటించింది. కృష్ణాజి దివినె సొసైటీ కి రాజీనామా చేసి ప్రపంచ యాత్రలకి పయనమై ప్రతి చోట ప్రసంగించేవారు.
వీరి ఉపన్యాసాలు ఎంతో తాత్వికతను, విజ్ఞానాన్ని సంస్కృతిని, అందిస్తూ మానవ వికాసానికి తోడ్పదేవిగా ఉండేవి "నేను మార్పు చెందాను. నా మిత్రుల జీవితాలకు మార్పుని తెస్తాను. ప్రపంచ పురోగతికి సాయపదతాను. నా అంతరమ్గమంతా శక్తి తో నిడినది " అని తెలిపారు. విశ్వ మనవుదయ్యాడు తన ప్రవచనాలతో. కృష్ణమూర్తి ఫౌన్దతిఒన్స ప్రపంచ మంతట వెలిసాయి.
1986 సంవత్సరం ఫిబ్రవరి 16 న ఇహలోక యాత్ర చాలించారు. అమర జీవులైనరు శ్రీ కృష్ణ మూర్తి.
వారి జయంతి సందర్భం గా వారి ఉపన్యాసాలను ఆస్వాదించండి.
Sunday, May 6, 2012
Budha Purnima
ఇవాళ బుద్ద పౌర్ణమి
Pay no attention to the faults of others,
things done or left undone by others.
Consider only what by oneself is done or left undone.
What we think, we become.
Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one getting burned
GOLDEN BUDHA |
| GOLDEN BUDHA |
http://images.travelpod.com/users/bl
GOLDEN BUDHA
Buddha Jayanti or also known as Buddha Purnima is the most sacred festivals of Buddhist. Buddha Purnima (Buddha Birthday) is celebrated in remembrance Lord Buddha. Lord Buddha is the founder of Buddhism. This day is the birth anniversary of Lord Buddha. It falls on the full moon of the fourth lunar month (month of Vaisakh) i.e. April or May. This day commemorates three important events of Buddha's life
- His birth in 623 BC.
- His enlightment i.e. attainment of supreme wisdom, in 588 BC.
- His attainment of Nirvana i.e. the complete extinction of his self at the age of 80.
This day is a thrice blessed day.
That is 6 5 2012
Monday, January 23, 2012
katha samskaaram - kakani chakrapani garu
కథా జగత్ లో "సంస్కారం" అనే కథ "కాకాని చక్రపాణి గారి"ది!
ఈ కథ పై నా విశ్లేషణ :
మనిషికి సంస్కారం ఎంతో అవసరం. ఈ మాట అందరు ఎరిగి ఉన్నదే ! ఆ సంస్కారం కుసంస్కరమా కాదా అని తెలిసేది ఆ వ్యక్తీ ప్రవర్తనని బట్టి వుంటుంది. పెరిగిన వాతావరణం నుంచి వుంటుంది. మారుతున్న సమాజంతో పాటు మనుషుల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చినదనటానికి నిదర్శనం ఈ కథ
బతికినన్నాళ్ళు భార్య భర్తల అనురాగాలు కుటుంబ ప్రేమాభిమానాలు ఒక బంధం లోనే ఇమిడి ఉండేవి. స్త్రీలు కూడా ఎన్నో బాధలు పడ్డా తన కుటుంబం కోసం చాల త్యాగాలు చేసేవారు.
కాని భర్త అంత్య దశలో కూడా ('పోయాడు, పీడాపోయింది' అని గొణుక్కుంది ఆమె, నిర్జీవమై పడి ఉన్న తన భర్త హరినారాయణ శవం వంక చూస్తూ. ) మనుషుల ఆలోచనల్లో మార్పు వచ్చిందనటానికి ఈ కథ ఒక ఉదాహరణ. పడిన కస్టాలు, బాధలు ఆమెని ఇలా ఆలోచింప చేసాయి సుఖం అన్నది ఎరుగదు
ఎంతో మానసిక క్షోభ పడితేనో తప్ప.... మనసు గాయపడి ఇలాటి ఆలోచనలు వస్తాయి??.
శవ జాగారం చేస్తూ భర్త మరణిస్తే భాగ్యలక్ష్మి అంతరంగంతో ఈ కథ మొదలవుతుంది. . తన పెళ్లి, అత్తా మామల విసుర్లు, గయ్యాళి అత్తా, సౌమ్యుడు అయిన మామ... చెడు తిరుగుళ్ళ భర్త...., అత్తా పోలికలు బుద్ధులు పుణికి పుచుకున్న కూతురు, మామ లాంటి ఆలోచనలతో కొడుకు ....... ఈ పాత్రల సంభాషణలతో కథ నిండి వుంటుంది
అంతిమ సంస్కారానికి ఇంటితో డబ్బుతో ముడిపెట్టి కూతురు, కొడుకు తండ్రి శవం ముందు పెట్టుకుని యాస్తి లావా దేవిలు మాట్లాడుకోవటం, డబ్బువుండి కూడా తండ్రి దహన సంస్కారాలకి ఆస్తితో లింకు పెట్టి డబ్బుఇచ్చిన సోదరి అమల.... దానితో ఇంటితో సంబంధం తెంచు కోవటం..... జగదీష్ (కొడుకు) చివరికి హైదరాబాదు పోవాలి అని తల్లితో అంటూ తదుపరి కార్యక్రమాలకి శ్రీ కారం చుట్టటం తో కధ ముగుస్తుంది.
అమల తన తండ్రి ఇంటిని స్వాధీన పరచుకోవటం లో ఎంతో తెలివిగా ప్రతిదానికి వాటా లేస్తూ ఇవ్వవలసిన లక్షల డబ్బుకు వేలల్లో లెక్క చూపుతుంది. అంతా స్వార్థం.... ప్రతిది లెక్క కడుతుంది.
తండ్రి దహన సంస్కారాలకి కూడా ఖర్చులో చూపుతూ, తను ఎంతో జాలి గుండె కలదానిని అని పదివేలు అందిస్తుంది. "ప్రేత సంస్కారం జరగకపోతే ఆ జీవుడు స్వర్గానికీ, నరకానికీ కాకుండా అలమటిస్తాడు. నీకివ్వాల్సిన అరవై వేలూ ఇప్పుడే ఇచ్చేస్తాను" అంది అమల.
ఈ కథలో శవ యాత్ర సమయం లో చేయవలసిన కర్మ కాండల విషయం లో జరిగే సత్యాలు ఇవి.... ఎవరు పంచుకుంటారు ఈ భారాని, ఈ భాద్యతలు అని సొంత పిల్ల మధ్య వైరాన్ని చక్కగా చూపించారు రచయిత
నాకు తెలిసి ఒకరికి చివరి సంస్కారాల విషయంలో కూడా దహన సంస్కారాలకి ధనం లేకపోతె పోయిన వ్యక్తి వంటిమీద సొమ్ముని తీసుకుని డబ్బు ఇచ్చిన సొంత పిల్లలూ వాళ్ళు వున్నారు. పది రోజుల కార్యక్రమానికి కూడా ఆ వ్యక్తి వంటి మీద సొమ్ములే అవసరమయ్యాయి.
డబ్బు ఎంతటి ద్వేషాగ్నులు రగులుస్తుందో, ఆప్యాయతానురాగాలు ఎలా కొరవడతాయో ఇందులో తెలుస్తుంది.
.
కథా కాలం ఆగష్టు 2009 నాటిది
Thursday, January 19, 2012
Katha Jagat - vennela pandinavela -
కథా జగత్ లో నేను ఎంచుకున్న కథ
"వెన్నెల పండిన వేళ" - రచన పోరంకి దక్షిణ మూర్తి.
కథా కాలం ఐదు దశాబ్దాల కిందటిది
కథ రాయలసీమ ప్రాంతానికి చెందింది.
కథా లో పాత్ర ఒక్కటే
కథ సామాజిక పరిస్తితికి అడ్డం పడుతోంది
కథ పాతదే అయినా నిత్య నూతనం
రాయల సీమ ప్రాంతం లో కరవు వచ్చినపుడు ఊళ్ళకి ఊళ్ళు ఖాళి అవుతుంటే ఒంటరి అయిన ఒక మాములు
కూలి చేసుకునే వ్యక్తి మనో గతం కథా అంశం .
తనకి అందరిలా బతుకు తెరువుకోసం వూరు విడిచి వెళ్ళాలి అని అనుకుంటాడు శివన్న.
యజమాని వూరు వెళ్తూ కూడా వెంట తీసుకు వెళ్ళకుండా భార్య తో "ఔను. వస్తేనే బాగుండేది. కాని ఊరు విడిచి రాగలడా?" అని తేల్చేస్తాడు ఆయన.
యజమాని వూరు వెళ్తూ కూడా వెంట తీసుకు వెళ్ళకుండా భార్య తో "ఔను. వస్తేనే బాగుండేది. కాని ఊరు విడిచి రాగలడా?" అని తేల్చేస్తాడు ఆయన.
వూరు ఖాళి అయిన పాతిక గడప అయిన లేని ఆ ఊర్లో ఒంటరిగా మిగిలిన శివన్న తోడుగా ఒక ఆవు, ఒక చిన్నారి మిగులుతాయి . తనకే ఈ తాడు బొంగరం లేదని అనుకుంటే ఇద్దరి బాధ్యత తనదే అవుతుంది.
అయిన బెంగ పడడు. బీడుగా మారిన ఆ వూళ్ళో కల్సి వుండాలని వాళ్ళని సంతోషంగా స్వీకరిస్తాడు. నోరు లేని ఆవు , మాటలు సరిగా రాని పాపా మూగగా తమ సంతోషాని వ్యక్త పరచటంతో కథ ముగుస్తుంది.
ఈ కథ లో రచయిత రాయలసీమ నేపధ్యాన్ని కథ వస్తువుగా తీసుకున్నారు.
కథలో అక్కడి మాండలికాలని వాడారు.
ఉదాహరణకి.... చెలికలు, చివ్వల, మండిక ఇత్యాది పదాలు ఇక్కడి వారికి అంతగా తెలీదు.
యువకుడు తానున్న పరిస్తితి ని విశ్లేషించుకుంటూ ఎక్కడికైనా పోయి కాయ కష్టం చేసుకోవచ్చు అయినా తను పుట్టి పెరిగిన గడ్డ మీద మమకారం అందరిలా వలస పోనివ్వదు
చక్కని మనో చిత్రణ అది.
చదువరులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో సమాజ పరిస్తితులు, మానవ నైజం విలువలకి కట్టుబడి వుండటం తెలుస్తాయి ఇక్కడ ధనవంతుల ప్రసక్తి రాదు. ఒక సామాన్యుడు, ధనంలేనివాడు, తోటి వారికి ఎలా సాయం చేస్తుంటాడో తెలుస్తుంది.
డబ్బున్న యజమాని తనకి ఎంతో సాయం చేసి, ఇంటి పనులన్నీ చేస్తూ, దుకాణం లో పని చేస్తూ, సామానులన్ని ఒంటి చేత్తో బళ్ళల్లో పెట్టిన వ్యక్తికి ఇచ్చిన సాయం కేవలం పది రూపాయలు మాత్రమే. అది ఎంతవరకు, ఎన్నాళ్ళు సాయముంటుందో తెలీదు. అయినా శివన్న బాధ పడడు. మానవత్వం తో తను వాళ్ల (ఆవు , పాప ) బాధ్యత స్వీకరిస్తాడు.
ఇంత మంచి కథని విశ్లేషణ రూపంలో నేను నా మనో భావాలను ఇలా తెలియ పరుస్తున్నందుకు రచయితగారిని మన్నించమని కోరుకుంటూ......
ధన్యవాదాలతో
మణినాథ్
Subscribe to:
Posts (Atom)


