Search

Monday, July 2, 2012

గురు పూర్ణిమ

గురు పూర్ణిమ
vyas bhagavan

Click these two Links to listen music


                                             Srimannarayan Hari
ఈ రోజు గురు పూర్ణిమ. గురువులని పూజించే రోజు.  గురు పూజోత్సవం 
వ్యాస భగవానుడు జన్మించిన రోజుగా భావించే ఈ రోజుని వ్యాస్ పూర్ణిమ అని గురు పూర్ణిమ అని అంటారు.
   "గురు బ్రహ్మ గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వర: 
గురు సాక్షాత్ పరబ్రహ్మ: తస్మైశ్రీ గురవే నమ:
                ఒక వ్యక్తి జీవితం లో గురువు యొక్క ప్రాముఖ్యతని తెలుపుతుంది ఈ శ్లోకం. ఆషాడ శుక్ల పక్షం నాడు వచ్చే పూర్ణిమని 
Vyas Mandir, Haridwar
Vyasa Mandir at Haridwar
గురు  పూర్ణిమగా  వ్యవహరిస్తారు.   పూర్వ కాలం లో గురుకులం లో శిక్షణ ఇచేవారు. పూర్తి అయిన శిష్యులు గురు దక్షిణ సమర్పించుకోవటం, గురుపూజ చేయటం చేసేవారు. 
       
ఫలం పుష్పం, తోయం, ధనం, ధ్యాన్యం  వస్త్రం ఇలా ఏదైనా గురువుకి సమర్పించుకోవచ్చు. ఈ రోజు గురువు వందనం చేసి ఆశీర్వాదాలు పొందాలి. మనకి విద్య నేర్పిన గురువు ఎవరైనా సరే భక్తితో నమస్కరించాలి. జ్ఞానం ఇచ్చిన వారెవరైనా సరే, వయసులో చిన్న అయిన సరే, జీవిత సోపానం లో మనకి తెలియంది తెలియ చెప్పిన గురువు ఎవరైనా సరే వందనం అర్పించాల్సిందే!
Vyas mandir Haridwar 
గురువు అంటే అజ్ఞానంధకారాన్ని పోగొట్టి జ్ఞాన దీపాలు వెలిగించేవాడు. 
శిష్యుని మదిలో భక్తిని ప్రేరేపించి, మానవత్యాన్ని మేల్కొలిపి, మానసిక అందోళనలని పోగొట్టి శిష్యుని మేలు కోరేవాడు గురువు.
ఈ రోజు గురు వ్యాస దేవుడు మహాభారతాన్ని రచించాడు. పద్దెనిమిది పురాణాలు, భగవత్ గీత, బ్రహ్మసుత్రాలు మీమాంస అనే వి కూడా రచించిన ఆది గురువు. 
పరాశర మహర్షి  పుత్రుడు  వ్యాసుడు.  
రైతన్నలకు ఈ మాసం లో పడి తొలకరి చినుకులు వారి భవిష్యత్తుకి పునాదులు. వరి నాట్లు నాటే సమయం. ముందుగ ఈ రోజు పుడమి తల్లిని పుజిస్తారు. నాగలి పట్టి పొలం పనులు చేపడుతారు.    

విద్యార్ధులు తమ టీచర్స్ కి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి 

వ్యాస మహర్షి 

No comments:

Post a Comment