Search

Thursday, May 17, 2012

సనాతనం మన హిందూ ధర్మం


  సనాతనం మన హిందూ ధర్మం  


  
                  శ్రీ పీఠం ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ రహస్య ప్రవచానాల కార్యక్రమం నెల రోజుల పాటు  హైదరాబాద్  నగరంలో జరిగింది.  ఆ సందర్భంలో  ఆర్ష విద్య గురుకుల వ్యవస్తాపకులు అయిన   దయానంద సరస్వతి స్వామి  ఇటీవల నగరానికి విచ్చేసినపుడు   పరిపూర్ణనంద స్వామిజి జగద్గురు వైభవం పేరిట దివ్య పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు  శ్రీ  దయానంద సరస్వతి స్వామిజి కి   శృంగేరి శారదాపీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ఆదిశంకర గౌరవపురస్కారాన్ని అందచేసారు. ఆ సందర్భంగా పరిపూర్ణనంద స్వామిజి తమ గురువుతో పాటు   ఆర్షగురుకులంలో   సన్యాస దీక్ష పొందిన తెలుగు వారైన 13 స్వామీజిలను  వేదిక మీదకు ఆహ్వానించి గౌరవంగా సత్కరించారు.  
               ఈ సందర్భం గా ఆనాటి సభలో స్వామిజి ఆంగ్ల ప్రసంగానికి తెలుగులో పరిపూర్ణనంద స్వామిజి తర్జుమా చేసి అందరికి వినిపించారు. 
" అనాది నుంచి ఈ భూమి మీద ఎన్నో మతాలున్నాయి.  కానీ అందులో కొన్ని మతాలూ అంతరించి పోయాయి  పూర్వకాలంలో కూడా ఒక తీవ్ర తరమైనటు వంటి భావ జాలంతో తన ఉనికిని చాటుకునే దిశగా ఎన్నో మతాలూ  ఈ భూమి మీద పాలన చేసాయి. వాటిల్లో కొన్ని లేవు. . కానీ ఇటీవల కొన్ని కొత్త మతాలూ వచ్చాయి  అవన్నీ తన మనుగడకి తమ ఉనికిని చాటుకోవడం కోసం అవన్నీచాలా తీవ్ర  తరంగ ఒక రకంగా ఉగ్ర రూపం ధరించి   విస్తరించే ప్రయత్నం చేస్తున్నాయి.  కానీ ఈ భూమ్మీద సనాతన మైనటువంటి ఈ హిందూ ధర్మం లేనటువంటి రోజు లేదు .   సనాతనమైన ఈ ధర్మం    అప్పుడు,  ఇప్పుడు  ఉంది . ఎప్పటికి ఉంటూనే వుంటుంది  అందుకే  సనాతనం అని అన్నారు. 
            ఈ భూమ్మీద  సైన్సు అనేది ఒకప్పుడు పుట్టలేదు. భూమితో పాటే ప్రక్రుతి తో పాటే సైన్సు అనేది పుట్టింది.   ఆ సైన్సు అనేది ఏ సైంటిస్ట్ కానీ పెట్టింది  కాదు.   ప్రక్రుతి ఆవిర్భావం నుంచే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఆ విషయం  ఇప్పుడు న్యూ టన్  చెప్ప్పాడు.  అలాగే   వైజ్ఞానిక దృక్పధంతో  విజ్ఞాన వేత్తలు  కనుగునే ఒక్కొక్క   సారం కూడా ప్రకృతిలో  అనాదిగా  ఉన్న విషయాలనే చెపుతున్నారు.  
 సైన్సు కొత్త కాదు. అలాగే మన వేదాలు కానీ హిందూ వాగ్మయాలు కానీ  ఎవరు పుట్టించింది కాదు.  ఇది  కాలంతో పాటు అనాది నుంచి  వస్తుంది.    కానీ సైన్సు కి వాగ్మయాలుకి వున్నాచిన్న  తేడా ఏమిటంటే . సైన్సు కి పది  ఏళ్ళ క్రితం ఒక సైంటిస్ట్ ఒక ఫార్మలా చెపితే ఇరవై ఏళ్ళ  తరువా త ఇంకో సైంటిస్  దాని మర్చి ఇంకా ఉన్నతమైనది గా మార్పులు చేస్తూ ఉంటాడు.   నలభై ఎళ్ళ   తరువాత రక రకాలుగా మార్పులు చేస్తూ వుంటాడు  ఇలా బెటర్ మెంట్ పొందు తూనే వుంటుంది సైన్సు. కానీమన వేదం శాస్త్రంలో   'అహం  బ్రహ్మస్మి తత్మ్వమసి' అనే వాక్యం చెప్పిన తరువాత దాన్ని మార్చే  మతం లేదు బెట్టేర్మేంట్ చేసే వ్యాక్యం వుండదు.. అదే  సైన్సు కి మన వేదాంతానికి  వున్నా తేడా.  వేదాలు తర తరాల నుంచి  అలానే ఉంది  దాన్ని మార్పులు చేయలేము. భగవంతుడు ఎక్కడో లేదు. ఆణువణువూ ప్రకాశిస్తున్నాడు  అనే సత్యాన్ని మనం ఆచరించి చూపిస్తున్నాం.  
             మన సంప్రదాయం లో ఆలోచిస్తే రుద్రం లో ఒక వ్యాక్యం ఉండి. నమస్తే అస్తు భగవాన్ .అంటే  పరమాత్మా  నీకు నమస్కారం అని. మనం ఎవరైనా కనిపిస్తే నమస్తే అంటాం భగవంతునికి, ఒక వ్యక్తిని వేరుగా చూడని ఏకైక సనాతన హిందూ ధర్మం మనది. ఇతర మతాలలో దేవుడు వేరు, వ్యక్తీ వేరు. కానీ మన భారత దేశం లో ఆవిర్భ వించిన సనాతన ధర్మం  ఏదైతే వుందో అది ఒక్కటే భగవంతుని, వ్యక్తిని వేరుగా కాకుండా సమైక్య దర్సనంగా చూప  గలిగే శాస్త్రం హిందూ ధర్మం మాత్రమే. అటువంటి హిందూ ధర్మం లో పుట్టమంటే అది మన భాగ్యం.    
         చేపలకి నీటిలో  వుంటూ  మునిగి పోకుండా ఎలా ఉండాలో తెలుసు. చేప నీటిలో ఉంటేనే బతుకుతుంది. బయట పడితే మరణిస్తుంది. దాని ఉనికి కోల్పోతుంది  అలాగే మనం హిందువుగా బతికున్నంత కాలం ఈ భారత  భూమిలో మనకి మనుగడ. ఉనికి నిలబడాలంటే హిందువుగానే జీవించాలి.   ఒక హిందువు మాత్రమే తన ధర్మాన్ని మతాన్ని పరి రక్షించుకుంటూ ఇతర మతాలని కూడా బ్రతక నివ్వగలిగే  యోగ్యతా ఒక్క హిందూ మతానికి ఉంది. 
            ఒక హిందువు క్రైష్టవులకి, ముస్లిములకి , నాస్తికుడికి వ్యతిరేకి కాదు. వాటి వాటి ఉనికిని పరి రక్షించగలిగే మతం హిందూ మతం. మనం   అటువంటి సనాతన ధర్మంలో పుట్టాం జీవిస్తున్నాం  అటువంటి సంస్కృతిలో పుట్టాం.,
            మనం ఒక రాయికి మొక్కుతున్నాము అంటే ఆ రాయి లో వున్నది సాక్షాత్తు ఆ శ్రీ మన్నారాయణునుడే  అనే భావనతో వుండటం వల్లే. అలాగే    
   మనం పసుపుకి నీరు చేర్చి ముద్దగా చేర్చి గణపతిగా ఆరాధిస్తాం, ఆవాహయామి అని పూజ అంత చేసిన తరువాత ఆ పసుపు ముద్దని తిరిగి పులుసు వంటి వంటల్లో  ఉపయోగించం. కారణం,  ఆ పసుపుని మనం గణపతిగా భావి స్తున్నాం కనుక.  మన భావనలో, భావుకతలో పరమాత్మే  నిండి వున్నాడు.   ఇటువంటి  గొప్ప సంస్కృతి మనది. " అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. 
వారు తన ప్రసంగంలో సనాతనమైన మన హిందూ ధర్మాన్ని గురించి వివరించారు. 
  శ్రీ  దయానంద సరస్వతి స్వామిజి కి  ఆరోగ్యం సరిగా లేకున్నా కోయంబత్తుర్ నుంచి మన నగరానికి విచ్చేసి మన జంట నగరాల వాసులకు తమ అనుగ్రహ భాషణం తో అలరించారు. ఆరోజు ఉదయం కూడా వారు తమ ఆశ్రమం లో పండితులకి సంస్కృత పాఠాలు తీసుకుని వచారు. వారికి వేదాలంటే ఎంతో మక్కువ. వేదాలే వారి ఊపిరి, ఆహరం, నీరు కూడా...  స్వామి దయానంద ఎందఱో శిష్యుల్ని తయారు చేసారు.  పరిపూర్ణనంద స్వామి నిర్వహించే లలితా సహస్రనామ జ్ఞాన యజ్ఞం చూసి వారు ఆనందంతో ఆనాటి సభలో తాను  కూడా పరిపూర్నానంద నయ్యనని అన్నారు. 













No comments:

Post a Comment