Search

Thursday, May 10, 2012

jiddu krishnamurthy

   










  ప్రముఖ తత్వవేత జిడ్డు కృష్ణ మూర్తి జన్మ దినం 

ప్రముఖ తత్వ వేత్త శ్రీ జిడ్డు కృష్ణ మూర్తి మే, 11 1895 మదనపల్లి లో  జన్మించారు. సంజీవమ్మ నారాయణ దంపతుల అష్టమ సంతానం వీరు.
పది సంవత్సరాల వయసులో తల్లి మరణించింది. వీరు చిన్న తనం లోనే తండ్రి, తమ్ముడు నిత్య నందాతో పాటు మద్రాస్ నగరం లో దివ్య జ్ఞాన సమాజంలో  నివసించేవారు. ఆ సమాజానికి అధ్య క్షు రాలైన డా. అనీబి సెంట్,   లెడ్ బీటర్ అనే ముఖ్య మైన వ్యక్తి ఆడుకుంటున్న కృష్ణమూర్తి లో దివ్య తేజస్సు వుందని గుర్తించారు. వీరే తమ మాస్టర్ కాగలరని  వీరిలో దివ్య శక్తులున్నాయని, వీరే తమ సమాజానికి కాబోయే గురువని గుర్తించారు. అన్నతమ్ములిద్దరిని లండన్ పంపించారు.  కృష్ణ మూర్తి గారిని దత్త తీసుకున్నారు. 
          వీరికి అన్ని రంగాల్లో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. 
          అనీ బీసెంట్ కృష్ణ మూర్తి గారిని తల్లిలా ఆదరించింది. ప్రేమగా లాలించింది. గురువులా శిక్షణ అందించింది. 
         కృష్ణమూర్తి దివ్య జ్ఞాన సభలకి హాజరవటం, హెరాల్డ్ పత్రికని నడపటం, తారా పరిషద్ నిర్వహించటం చేసేవారు. కొలది కాలం లోనే కృష్ణమూర్తి దివినె సొసైటీ వుంచి వైదొలగి విస్తృతంగా ప్రపంచం అంటా తన పర్యటన సాగించి ఉపన్యాసాలిచ్చెవారు.
       "హృదయానికి ప్రేమ, మేధకు తెలివి ఉన్నాయి ఈ రెండు సమ పాళ్ళలో పెరిగినపుడు సంపూర్ణ వికాసం సిద్ధించి మనిషిని పూర్ణ మానవునిగా తీర్చి దిద్దుతుంది. హృదయం సత్సంబంధాలు కలిగిస్తుంది. సంబంధమే జీవితం. ప్రతి వ్యక్తి కి  సమాజం పట్ల బాద్య త  వుంది." అని అనేవారు.
      కృష్ణమూర్తి గారిని కృష్ణాజి   అనేవారు. హాలండ్ డెన్మార్క్, ఫ్రాన్సు, మొదలైన ఎన్నో దేశాలు చుట్టి వచ్చే వారు. గంభీరమైన తన కంఠం తో ఉపన్యాసా 
లిచ్చేవారు  .  
    కాలిఫోర్నియా లోని ఒహై వాలి లో ఆర్య విహార్ అనే ఆశ్రమం నిర్మించుకున్నారు. 
 కృష్ణ మూర్తి యోగిలా మారారు. అధిక సమయం meditation లో వుండేవారు. 
రోజులు నెలలు గడిచాయి... జ్ఞానోదయమైంది తేజస్సు వెలుగొంద సాగింది.శక్తి పెరిగింది. 
జిడ్డు కృష్ణ మూర్తి దివ్య జ్ఞా న సమాజ స్వర్నోత్శావాలకు మద్రాస్ నగరానికి వచ్చారు.  ఆ సమయం లో తమ్ముని మరణ వార్త తెలిసింది. 
తమ్ముని మరణ వార్త తొలుత క్రుంగ దీసినా. శక్తి పుంజుకొని, జీవితాన్ని ఎదుర్కొన్నాడు. దివినె సొసైటీ స్వర్ణోత్సవ సభలో కృష్ణాజి ప్రపంచ బోధకుడు అయ్యాడని అనిబిసెంట్   ప్రకటించింది. కృష్ణాజి దివినె సొసైటీ కి రాజీనామా చేసి ప్రపంచ యాత్రలకి పయనమై ప్రతి చోట ప్రసంగించేవారు. 
 వీరి ఉపన్యాసాలు ఎంతో తాత్వికతను, విజ్ఞానాన్ని సంస్కృతిని, అందిస్తూ మానవ వికాసానికి తోడ్పదేవిగా ఉండేవి  "నేను మార్పు చెందాను. నా మిత్రుల జీవితాలకు మార్పుని తెస్తాను. ప్రపంచ పురోగతికి సాయపదతాను. నా అంతరమ్గమంతా శక్తి తో నిడినది " అని తెలిపారు. విశ్వ మనవుదయ్యాడు తన ప్రవచనాలతో. కృష్ణమూర్తి ఫౌన్దతిఒన్స ప్రపంచ మంతట వెలిసాయి. 
             1986 సంవత్సరం ఫిబ్రవరి 16  న ఇహలోక యాత్ర చాలించారు. అమర జీవులైనరు శ్రీ కృష్ణ మూర్తి. 

వారి జయంతి సందర్భం గా వారి ఉపన్యాసాలను ఆస్వాదించండి.

   
   

     































































No comments:

Post a Comment