Search

Wednesday, May 30, 2012

"కలర్స్ అఫ్ జాయ్"

మిత్రులందరికీ 

స్వాగతం... సుస్వాగతం!!

మొట్ట మొదటి సరిగా బెంగుళూరు శ్రీ శ్రీ ఆశ్రమం లో జరగబోతున్న ప్రత్యేక కార్యక్రమం:                                   

"కలర్స్  అఫ్ జాయ్"        

     మే 31 నుండి జూన్ 3 , 2012  వరకు జరగ బోయే ఈ ప్రత్యెక కార్య క్రమంలో శ్రీ శ్రీ రవి శంకర్ గారు స్వయంగా పాల్గొనే ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో విలువైనది. ఈ విశేష కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి 2 ,000  మంది పైగా  చిన్నారులు పాల్గొంటున్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 200 యూత్   పాల్గొంటున్నారు.  దీనిని బట్టే  ఈ workshop ఎంత ప్రాధాన్యతని సంతరించుకుంటుందో తెలుస్తోంది 


                                   


ముఖ్యంగా యూత్ ని ఉద్దేశించి నిర్వహించే ఈ కార్యక్రమం యువతకి ఎంతో ఉపయోగం. 

ఈ వర్క్ షాప్ ...   ART excel, YES!, YES 2!  participants కోసం నిర్దేసించబడింది.  

       ఈ వేసవి లో సాధారణంగా తల్లి తండ్రులు తమ పిల్లలన్ని ఏదో వొక విధంగా వారి సమయాన్ని గడపడానికి ప్రత్యేక వేసవి శిబిరాలని ఆశ్రయిస్తుంటారు. వాటి ద్వారా పిల్లలు జ్ఞానం సంపాదించినా ఆటలు మొదలైన వాటి వాళ్ళ అలసి పోతుంటారు.
    నేటి చదువుల మానసిక వత్తిళ్ళ నుంచి దూరం కావటానికి, మానసికోత్సాహం పెంపొందటానికి పిల్లల కోసమే రూపొందించిన ఆర్ట్ అఫ్ లివింగ్ వారు చేపట్టిన బృహత్తర కార్యక్రమమే ఈ "కలర్స్  అఫ్ జాయ్ "
        విస్తారమైన ప్రదేశంలో  చుట్టూ  ఇదు కొండల నడుమ, చక్కని అందమైన  సరస్సు, సహజమైన ప్రక్రుతి వాతావరణం లో ఈ కార్యక్రమం జరుగుతోంది. శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఆశిస్సులతో నడిచే ఈవెంట్ ఎంతో అద్భుతం. అమోఘం.
     ఈ ఆర్ట్ ఎక్సెల్ లో ధ్యానం మరియు పరస్పర అవగాహనా ద్వారా  పిల్లల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి పెరగటం జరుగుతుంది. వారిలో సృజనాత్మక శక్తి అభివ్రుది చెందుతుంది.  ఏకాగ్ర త పెరుగుతుంది. స్నేహశీలత పెంపొందుతుంది. ప్రతిరోజూ ప్రతి విద్యార్ధి ఎదురుకునే మానసిక ఆందోళన దూరం అవటం, ఆత్మ విశ్వాసం పెరగటం ద్వారా వారు విజయం వేపు అడుగులు వేయగలుగుతారు.
      యువత కి సంబంధిచిన YES వర్క్ షాప్ లో వారిలో యువ శక్తి ని అధికం చేస్తుంది.  ప్రత్యేకమైన శ్వాస పద్ధతుల ద్వారా వారి ఆందోళనలు దూరమవటం, మదిలో చెలరేగే negetive emotions ,  (చెడు భావోద్రేకాలు ) దూరమవుతాయి. 
     YES 2   ...YES  పూర్తి చేసుకున్న వారికోసం నిర్దేసించబడినది అ dynamic vibrant వర్క్ షాప్.  భాద్యతలు,  సమస్యలని అర్ధం  చేసుకోవటం,  తన పై నమ్మకం ఏర్పరచుకోవడం (సెల్ఫ్ కాన్ఫిడెన్సు ) మొదలైనవెన్నో ఈ వర్క్ షాప్ ద్వారా ఏర్పరచుకో గలుగుతారు. 
   ఈ నాలుగు రోజుల "కలర్స్ అఫ్ జాయ్"  కార్యక్రమం లో  meditation,  యోగ వంటివే కాదు....
    సుభాషితాలు చెప్పటం, గీత బోధించటం, పురాణ గాధలు వినిపించటం, ఆశ్రమం విహారాలు, హస్త కళలు నేర్పించటం, సహజ వాతావరణం లో పెరిగే పంటలు గురించిన దర్శనం, వివరణ, గోశాల  దర్శనం,  ప్రత్యేకించి భారత మాట గొప్పతనం ,,,  ఇలా ఎన్నో విషయాలపై చర్చలతో పాటు శ్రీ శ్రీ రవి శంకర్ గారు సన్నిధిలో ఈ వర్క్ షాప్ జరగటం నిజం గా ప్రతి విద్యార్ధి అదృష్టం.   

ఇందులో పాల్గొన్న కొందరి యూత్ అభిప్రాయాల వీడియో క్లిప్పింగ్స్..... 

No comments:

Post a Comment