కథా జగత్ లో నేను ఎంచుకున్న కథ
"వెన్నెల పండిన వేళ" - రచన పోరంకి దక్షిణ మూర్తి.
కథా కాలం ఐదు దశాబ్దాల కిందటిది
కథ రాయలసీమ ప్రాంతానికి చెందింది.
కథా లో పాత్ర ఒక్కటే
కథ సామాజిక పరిస్తితికి అడ్డం పడుతోంది
కథ పాతదే అయినా నిత్య నూతనం
రాయల సీమ ప్రాంతం లో కరవు వచ్చినపుడు ఊళ్ళకి ఊళ్ళు ఖాళి అవుతుంటే ఒంటరి అయిన ఒక మాములు
కూలి చేసుకునే వ్యక్తి మనో గతం కథా అంశం .
తనకి అందరిలా బతుకు తెరువుకోసం వూరు విడిచి వెళ్ళాలి అని అనుకుంటాడు శివన్న.
యజమాని వూరు వెళ్తూ కూడా వెంట తీసుకు వెళ్ళకుండా భార్య తో "ఔను. వస్తేనే బాగుండేది. కాని ఊరు విడిచి రాగలడా?" అని తేల్చేస్తాడు ఆయన.
యజమాని వూరు వెళ్తూ కూడా వెంట తీసుకు వెళ్ళకుండా భార్య తో "ఔను. వస్తేనే బాగుండేది. కాని ఊరు విడిచి రాగలడా?" అని తేల్చేస్తాడు ఆయన.
వూరు ఖాళి అయిన పాతిక గడప అయిన లేని ఆ ఊర్లో ఒంటరిగా మిగిలిన శివన్న తోడుగా ఒక ఆవు, ఒక చిన్నారి మిగులుతాయి . తనకే ఈ తాడు బొంగరం లేదని అనుకుంటే ఇద్దరి బాధ్యత తనదే అవుతుంది.
అయిన బెంగ పడడు. బీడుగా మారిన ఆ వూళ్ళో కల్సి వుండాలని వాళ్ళని సంతోషంగా స్వీకరిస్తాడు. నోరు లేని ఆవు , మాటలు సరిగా రాని పాపా మూగగా తమ సంతోషాని వ్యక్త పరచటంతో కథ ముగుస్తుంది.
ఈ కథ లో రచయిత రాయలసీమ నేపధ్యాన్ని కథ వస్తువుగా తీసుకున్నారు.
కథలో అక్కడి మాండలికాలని వాడారు.
ఉదాహరణకి.... చెలికలు, చివ్వల, మండిక ఇత్యాది పదాలు ఇక్కడి వారికి అంతగా తెలీదు.
యువకుడు తానున్న పరిస్తితి ని విశ్లేషించుకుంటూ ఎక్కడికైనా పోయి కాయ కష్టం చేసుకోవచ్చు అయినా తను పుట్టి పెరిగిన గడ్డ మీద మమకారం అందరిలా వలస పోనివ్వదు
చక్కని మనో చిత్రణ అది.
చదువరులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో సమాజ పరిస్తితులు, మానవ నైజం విలువలకి కట్టుబడి వుండటం తెలుస్తాయి ఇక్కడ ధనవంతుల ప్రసక్తి రాదు. ఒక సామాన్యుడు, ధనంలేనివాడు, తోటి వారికి ఎలా సాయం చేస్తుంటాడో తెలుస్తుంది.
డబ్బున్న యజమాని తనకి ఎంతో సాయం చేసి, ఇంటి పనులన్నీ చేస్తూ, దుకాణం లో పని చేస్తూ, సామానులన్ని ఒంటి చేత్తో బళ్ళల్లో పెట్టిన వ్యక్తికి ఇచ్చిన సాయం కేవలం పది రూపాయలు మాత్రమే. అది ఎంతవరకు, ఎన్నాళ్ళు సాయముంటుందో తెలీదు. అయినా శివన్న బాధ పడడు. మానవత్వం తో తను వాళ్ల (ఆవు , పాప ) బాధ్యత స్వీకరిస్తాడు.
ఇంత మంచి కథని విశ్లేషణ రూపంలో నేను నా మనో భావాలను ఇలా తెలియ పరుస్తున్నందుకు రచయితగారిని మన్నించమని కోరుకుంటూ......
ధన్యవాదాలతో
మణినాథ్
No comments:
Post a Comment