RAAKHEE
అన్నా చెల్లెళ్ళ బంధానికి గుర్తుగా రక్షా భందన్ ఈ రోజే . వెళ్లి పోతోంది కొద్ది నిముషాలో.
ఏంతో మంది అన్న చెల్లెళ్ళు తమ ప్రేమ గుర్తుగా రాఖీ కట్టించుకునే సంప్రదాయం ఇప్పుడు ఎక్కువగా ఉంటోంది.
మా చిన్నపుడు ఈ పండుగలు ఏమి లేవు. కానుకలు పుచుకోవ టా లు, రాఖీలు కట్టడాలు లేవు.
ఎప్పుడైనా ప్రేమగా ఒక చీరో, గాజులో ఇస్తే గొప్ప. (కొద్ది మంది ఇళ్ళల్లో మాత్రమే సుమా) కొంతమంది భారీగా కానుకలు ఇస్తుంటారు. అనుకోండి.
అన్నట్లు ఇవాళ ఇంకో ముఖ్యమైన పండుగ శ్రవణ పౌర్ణమి కూడా. అతివలందరికి ఏంతో ముఖ్యమైన పండుగ కూడా.
రక్షా బంధనం మన పురాణాల లో కూడా వుందని తెలుస్తోంది.
ఇంద్రుదు, కృష్ణుడు ఇలా దేవతలు కూడా రాఖీ కట్టారుట
యేన బద్దో బలీ రాజా దాన వేంద్రో మహా బలా
తేనత్వా మాభి బద్నామి రక్షే మా చల మా చల
ఈ మంత్రాని పఠిస్తూ రాఖీ కడతారు.
'
కాని ప్రస్తుతం మాత్రం ప్రతి ఇంట ప్రతి చెల్లి (అక్క) తమ అన్నలు (తమ్ముళ్ళకి) రాఖీలు కట్టటం వేడుకగా మారింది.సోదరి సోదరుని నుదుట తిలకం దిద్ది, చేతికి రక్షగా రాఖీ కట్టి తీపి తినిపిస్తుంది.
దానికి సోదరుడు తమ చెల్లెలి మేలు కోసం ఏమైనా చేయటానికి సిద్దం అంటూ ఆమెకి పసుపు కుంకుమలు కానుకగా ఇస్తాడు.
జంధ్యాల పౌర్ణమి
జంధ్యాలు ధరించే వారు నూతన జంద్యాని ధరిస్తారు. వెడాలు చదవటం చేస్తారు. నాలుగు వేదాల ను ఆరంభ ఋక్కులను చివరి ఋక్కులను వేద పండితులు పఠి స్తారు. పాత జంధ్యాలను తీసివేసి కొత్త జంధ్యాలను (యగ్నోపవీతాల ను) ధరిస్తారు.
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ......
Aum Yagnopaveetham Paramam pavithram prajapatheyatsahjam purastat|
Ayushya magyam pratimanch Shubram yagnopavitam balamustu Tejah|
yagnopavithamaci yagnasya tva yagnopavithenopanhyami||
ఈ రోజు హయగ్రీవ జయంతి కూడా.
ఇలా ఎన్నో పండుగల కలయికే ఈ శ్రావణ పౌర్ణమి
No comments:
Post a Comment