Search

Monday, January 23, 2012

katha samskaaram - kakani chakrapani garu

కథా జగత్ లో "సంస్కారం" అనే కథ "కాకాని చక్రపాణి గారి"ది!
ఈ కథ పై నా విశ్లేషణ :
మనిషికి సంస్కారం ఎంతో     అవసరం. ఈ మాట అందరు ఎరిగి ఉన్నదే ! ఆ సంస్కారం కుసంస్కరమా కాదా అని తెలిసేది ఆ వ్యక్తీ ప్రవర్తనని బట్టి వుంటుంది. పెరిగిన వాతావరణం నుంచి వుంటుంది. మారుతున్న సమాజంతో పాటు మనుషుల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చినదనటానికి నిదర్శనం ఈ కథ 
బతికినన్నాళ్ళు భార్య భర్తల అనురాగాలు కుటుంబ ప్రేమాభిమానాలు ఒక బంధం లోనే ఇమిడి ఉండేవి. స్త్రీలు కూడా ఎన్నో   బాధలు   పడ్డా తన కుటుంబం కోసం చాల త్యాగాలు చేసేవారు.  
కాని భర్త అంత్య దశలో కూడా ('పోయాడు, పీడాపోయింది' అని గొణుక్కుంది ఆమె, నిర్జీవమై పడి ఉన్న తన భర్త హరినారాయణ శవం వంక చూస్తూ. ) మనుషుల ఆలోచనల్లో    మార్పు వచ్చిందనటానికి ఈ కథ ఒక ఉదాహరణ. పడిన కస్టాలు, బాధలు ఆమెని ఇలా ఆలోచింప చేసాయి సుఖం అన్నది ఎరుగదు
ఎంతో   మానసిక క్షోభ   పడితేనో  తప్ప....  మనసు గాయపడి ఇలాటి ఆలోచనలు వస్తాయి??. 

శవ జాగారం చేస్తూ భర్త మరణిస్తే భాగ్యలక్ష్మి  అంతరంగంతో  ఈ కథ మొదలవుతుంది. . తన పెళ్లి, అత్తా మామల విసుర్లు, గయ్యాళి అత్తా, సౌమ్యుడు   అయిన మామ... చెడు తిరుగుళ్ళ భర్త...., అత్తా పోలికలు  బుద్ధులు   పుణికి పుచుకున్న కూతురు, మామ లాంటి ఆలోచనలతో కొడుకు ....... ఈ పాత్రల సంభాషణలతో కథ నిండి వుంటుంది  

అంతిమ సంస్కారానికి  ఇంటితో డబ్బుతో ముడిపెట్టి కూతురు, కొడుకు తండ్రి శవం ముందు పెట్టుకుని యాస్తి లావా దేవిలు మాట్లాడుకోవటం, డబ్బువుండి   కూడా  తండ్రి దహన సంస్కారాలకి  ఆస్తితో లింకు పెట్టి డబ్బుఇచ్చిన సోదరి అమల....  దానితో ఇంటితో సంబంధం తెంచు కోవటం.....     జగదీష్ (కొడుకు)  చివరికి హైదరాబాదు పోవాలి అని తల్లితో అంటూ తదుపరి కార్యక్రమాలకి   శ్రీ కారం చుట్టటం తో కధ ముగుస్తుంది. 

 అమల తన తండ్రి ఇంటిని స్వాధీన పరచుకోవటం లో ఎంతో తెలివిగా ప్రతిదానికి వాటా లేస్తూ ఇవ్వవలసిన లక్షల డబ్బుకు వేలల్లో లెక్క  చూపుతుంది. అంతా స్వార్థం.... ప్రతిది లెక్క కడుతుంది.
తండ్రి దహన సంస్కారాలకి కూడా ఖర్చులో చూపుతూ,  తను ఎంతో జాలి గుండె కలదానిని అని  పదివేలు అందిస్తుంది. "ప్రేత సంస్కారం జరగకపోతే ఆ జీవుడు స్వర్గానికీ, నరకానికీ కాకుండా అలమటిస్తాడు. నీకివ్వాల్సిన అరవై వేలూ ఇప్పుడే ఇచ్చేస్తాను" అంది అమల.



ఈ కథలో శవ యాత్ర సమయం లో చేయవలసిన కర్మ కాండల విషయం లో జరిగే సత్యాలు ఇవి....  ఎవరు పంచుకుంటారు ఈ భారాని, ఈ భాద్యతలు   అని సొంత పిల్ల మధ్య వైరాన్ని చక్కగా చూపించారు రచయిత

నాకు తెలిసి ఒకరికి చివరి సంస్కారాల విషయంలో కూడా దహన సంస్కారాలకి ధనం లేకపోతె పోయిన వ్యక్తి వంటిమీద సొమ్ముని తీసుకుని  డబ్బు ఇచ్చిన సొంత  పిల్లలూ    వాళ్ళు వున్నారు.  పది రోజుల   కార్యక్రమానికి  కూడా ఆ వ్యక్తి వంటి మీద సొమ్ములే అవసరమయ్యాయి.   

డబ్బు ఎంతటి ద్వేషాగ్నులు రగులుస్తుందో,  ఆప్యాయతానురాగాలు   ఎలా కొరవడతాయో ఇందులో తెలుస్తుంది.


.
కథా కాలం ఆగష్టు 2009 నాటిది 







Thursday, January 19, 2012

Katha Jagat - vennela pandinavela -

కథా జగత్ లో నేను ఎంచుకున్న కథ
"వెన్నెల పండిన వేళ" - రచన పోరంకి దక్షిణ మూర్తి.
కథా కాలం ఐదు దశాబ్దాల కిందటిది   
కథ రాయలసీమ ప్రాంతానికి చెందింది.
కథా లో పాత్ర ఒక్కటే 
కథ సామాజిక పరిస్తితికి అడ్డం పడుతోంది 
కథ పాతదే అయినా నిత్య నూతనం            
                 
       రాయల సీమ ప్రాంతం లో కరవు వచ్చినపుడు ఊళ్ళకి ఊళ్ళు ఖాళి అవుతుంటే ఒంటరి అయిన ఒక  మాములు 
కూలి చేసుకునే వ్యక్తి మనో గతం కథా అంశం .
     తనకి అందరిలా బతుకు తెరువుకోసం వూరు విడిచి వెళ్ళాలి అని అనుకుంటాడు   శివన్న.
    యజమాని వూరు వెళ్తూ కూడా వెంట తీసుకు వెళ్ళకుండా భార్య తో "ఔను. వస్తేనే బాగుండేది. కాని ఊరు విడిచి రాగలడా?" అని తేల్చేస్తాడు  ఆయన.                                                                                             
   వూరు ఖాళి అయిన పాతిక గడప అయిన లేని ఆ ఊర్లో ఒంటరిగా మిగిలిన శివన్న తోడుగా ఒక ఆవు, ఒక చిన్నారి మిగులుతాయి . తనకే ఈ తాడు బొంగరం లేదని అనుకుంటే ఇద్దరి బాధ్యత తనదే అవుతుంది. 
        అయిన బెంగ పడడు. బీడుగా మారిన ఆ వూళ్ళో కల్సి వుండాలని వాళ్ళని సంతోషంగా స్వీకరిస్తాడు. నోరు లేని ఆవు , మాటలు సరిగా రాని పాపా మూగగా తమ సంతోషాని వ్యక్త పరచటంతో  కథ ముగుస్తుంది.

        ఈ కథ లో రచయిత రాయలసీమ నేపధ్యాన్ని కథ వస్తువుగా తీసుకున్నారు.
కథలో అక్కడి మాండలికాలని వాడారు. 
ఉదాహరణకి....  చెలికలు, చివ్వల, మండిక ఇత్యాది పదాలు ఇక్కడి వారికి అంతగా తెలీదు.
యువకుడు తానున్న పరిస్తితి ని విశ్లేషించుకుంటూ ఎక్కడికైనా పోయి కాయ కష్టం చేసుకోవచ్చు అయినా తను పుట్టి పెరిగిన గడ్డ మీద మమకారం అందరిలా వలస పోనివ్వదు         
      చక్కని మనో చిత్రణ అది. 
      చదువరులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో సమాజ పరిస్తితులు, మానవ నైజం విలువలకి కట్టుబడి వుండటం తెలుస్తాయి  ఇక్కడ ధనవంతుల ప్రసక్తి రాదు. ఒక సామాన్యుడు, ధనంలేనివాడు, తోటి వారికి ఎలా సాయం చేస్తుంటాడో తెలుస్తుంది. 
        డబ్బున్న యజమాని తనకి ఎంతో సాయం చేసి, ఇంటి పనులన్నీ చేస్తూ, దుకాణం లో పని చేస్తూ, సామానులన్ని ఒంటి చేత్తో బళ్ళల్లో పెట్టిన వ్యక్తికి ఇచ్చిన సాయం కేవలం పది రూపాయలు మాత్రమే. అది ఎంతవరకు, ఎన్నాళ్ళు సాయముంటుందో తెలీదు.   అయినా శివన్న బాధ పడడు. మానవత్వం తో తను వాళ్ల  (ఆవు , పాప ) బాధ్యత స్వీకరిస్తాడు.

ఇంత మంచి కథని విశ్లేషణ రూపంలో నేను నా మనో భావాలను ఇలా తెలియ   పరుస్తున్నందుకు  రచయితగారిని మన్నించమని కోరుకుంటూ...... 

ధన్యవాదాలతో 
మణినాథ్