Search

Monday, January 23, 2012

katha samskaaram - kakani chakrapani garu

కథా జగత్ లో "సంస్కారం" అనే కథ "కాకాని చక్రపాణి గారి"ది!
ఈ కథ పై నా విశ్లేషణ :
మనిషికి సంస్కారం ఎంతో     అవసరం. ఈ మాట అందరు ఎరిగి ఉన్నదే ! ఆ సంస్కారం కుసంస్కరమా కాదా అని తెలిసేది ఆ వ్యక్తీ ప్రవర్తనని బట్టి వుంటుంది. పెరిగిన వాతావరణం నుంచి వుంటుంది. మారుతున్న సమాజంతో పాటు మనుషుల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చినదనటానికి నిదర్శనం ఈ కథ 
బతికినన్నాళ్ళు భార్య భర్తల అనురాగాలు కుటుంబ ప్రేమాభిమానాలు ఒక బంధం లోనే ఇమిడి ఉండేవి. స్త్రీలు కూడా ఎన్నో   బాధలు   పడ్డా తన కుటుంబం కోసం చాల త్యాగాలు చేసేవారు.  
కాని భర్త అంత్య దశలో కూడా ('పోయాడు, పీడాపోయింది' అని గొణుక్కుంది ఆమె, నిర్జీవమై పడి ఉన్న తన భర్త హరినారాయణ శవం వంక చూస్తూ. ) మనుషుల ఆలోచనల్లో    మార్పు వచ్చిందనటానికి ఈ కథ ఒక ఉదాహరణ. పడిన కస్టాలు, బాధలు ఆమెని ఇలా ఆలోచింప చేసాయి సుఖం అన్నది ఎరుగదు
ఎంతో   మానసిక క్షోభ   పడితేనో  తప్ప....  మనసు గాయపడి ఇలాటి ఆలోచనలు వస్తాయి??. 

శవ జాగారం చేస్తూ భర్త మరణిస్తే భాగ్యలక్ష్మి  అంతరంగంతో  ఈ కథ మొదలవుతుంది. . తన పెళ్లి, అత్తా మామల విసుర్లు, గయ్యాళి అత్తా, సౌమ్యుడు   అయిన మామ... చెడు తిరుగుళ్ళ భర్త...., అత్తా పోలికలు  బుద్ధులు   పుణికి పుచుకున్న కూతురు, మామ లాంటి ఆలోచనలతో కొడుకు ....... ఈ పాత్రల సంభాషణలతో కథ నిండి వుంటుంది  

అంతిమ సంస్కారానికి  ఇంటితో డబ్బుతో ముడిపెట్టి కూతురు, కొడుకు తండ్రి శవం ముందు పెట్టుకుని యాస్తి లావా దేవిలు మాట్లాడుకోవటం, డబ్బువుండి   కూడా  తండ్రి దహన సంస్కారాలకి  ఆస్తితో లింకు పెట్టి డబ్బుఇచ్చిన సోదరి అమల....  దానితో ఇంటితో సంబంధం తెంచు కోవటం.....     జగదీష్ (కొడుకు)  చివరికి హైదరాబాదు పోవాలి అని తల్లితో అంటూ తదుపరి కార్యక్రమాలకి   శ్రీ కారం చుట్టటం తో కధ ముగుస్తుంది. 

 అమల తన తండ్రి ఇంటిని స్వాధీన పరచుకోవటం లో ఎంతో తెలివిగా ప్రతిదానికి వాటా లేస్తూ ఇవ్వవలసిన లక్షల డబ్బుకు వేలల్లో లెక్క  చూపుతుంది. అంతా స్వార్థం.... ప్రతిది లెక్క కడుతుంది.
తండ్రి దహన సంస్కారాలకి కూడా ఖర్చులో చూపుతూ,  తను ఎంతో జాలి గుండె కలదానిని అని  పదివేలు అందిస్తుంది. "ప్రేత సంస్కారం జరగకపోతే ఆ జీవుడు స్వర్గానికీ, నరకానికీ కాకుండా అలమటిస్తాడు. నీకివ్వాల్సిన అరవై వేలూ ఇప్పుడే ఇచ్చేస్తాను" అంది అమల.



ఈ కథలో శవ యాత్ర సమయం లో చేయవలసిన కర్మ కాండల విషయం లో జరిగే సత్యాలు ఇవి....  ఎవరు పంచుకుంటారు ఈ భారాని, ఈ భాద్యతలు   అని సొంత పిల్ల మధ్య వైరాన్ని చక్కగా చూపించారు రచయిత

నాకు తెలిసి ఒకరికి చివరి సంస్కారాల విషయంలో కూడా దహన సంస్కారాలకి ధనం లేకపోతె పోయిన వ్యక్తి వంటిమీద సొమ్ముని తీసుకుని  డబ్బు ఇచ్చిన సొంత  పిల్లలూ    వాళ్ళు వున్నారు.  పది రోజుల   కార్యక్రమానికి  కూడా ఆ వ్యక్తి వంటి మీద సొమ్ములే అవసరమయ్యాయి.   

డబ్బు ఎంతటి ద్వేషాగ్నులు రగులుస్తుందో,  ఆప్యాయతానురాగాలు   ఎలా కొరవడతాయో ఇందులో తెలుస్తుంది.


.
కథా కాలం ఆగష్టు 2009 నాటిది 







No comments:

Post a Comment