Search

Thursday, December 1, 2016




దివికేగిన గాన గంధర్వుడు డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ ....
కర్ణాటక సంగీత విద్వావంసుడు, హిందుస్తానీ సంగీత కారుడు, అయిన డా.బాలమురళి కృష్ణ నిన్న చెన్నైలో తుది శ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో వారు ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. చిన్ననాటనే సంగీత కచేరీలు చేసిన వీరు, వీరు పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆ రోజుల్లో రేడియో మాత్రమే వినోద సాధనంగా వున్న రోజుల్లో ప్రతి రోజు ఉదయాన్నే వచ్చే భక్తి రంజనిలో వీరు పాడిన తత్వాలు ఎంతో జన బాహుళ్యం చెందాయి. ఏమి చేతురా లింగా... ఏమి చేతురా .... నిన్ను విడిచి ఉండలేనయ కైలాస వాసా.... కస్తూరి రంగ రంగా, రామదాసు కీర్తనలు, ఎందరో మహానుభావులు వంటి త్యాగరాజ కీర్తనలు కూడా ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో పాటలు ప్రతి ఇంట్లో ప్రతిద్వనించేవి
వీరు పాడిన కాసెట్స్ కలెక్షన్ కూడా ఉండేది ... పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మ భూషణ్ వంటి జాతీయ పురస్కారాలు అందుకున్న ఏకైక వ్యక్తి. పలుమార్లు డాక్టరేట్ బిరుదు పొందారు.
వీరు ఎన్నో అవార్డులు అందుకున్నారు. వాటిల్లో కొన్ని సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.
సంగీతమే ఊపిరిగా సాగే వీరు కొత్త కొత్త రాగాలు కూడా కనిపెట్టారు. మహతి, సుముఖం , సర్వశ్రీ ప్రతి మాధ్యమావతి, గణపతి, సిద్ది వంటి రాగాలు . ఈ విశిష్ఠ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్నాళ్ల కిందట నగరంలో టి టి డి కళ్యాణ మంటపం, హిమాయత్ నగర్ లో వారి సంగీత కచేరి జరిగినపుడు వారిని దగ్గరి నుంచి చూసే అవకాశం కలిగింది.
ఏమి సేతురా లింగ ...
https://www.youtube.com/watch?v=DOzbVCepY6w
నిన్ను విడిచి ఉండలేనయ్యా ..
https://www.youtube.com/watch?v=DOzbVCepY6w
పలుకే బంగారమాయెనా ...
https://www.youtube.com/watch?v=QlrikrgOA0E











Sunday, August 14, 2016


ఈ రోజు  ప్రముఖ నటి రాజసులోచన  జయంతి.
వారు  5, మార్చ్, 2013 లో  మరణించారు.
వారిని  ఇంటర్వ్యూ తీసుకున్న  నాటి   విశేషాలు,  జీవన విశేషాలు  ఈ  పోస్ట్ లో..

యన్.టి.ఆర్ అవార్డు గ్రహీత రాజసులోచన గారితో ఒక ఇంటర్‌వ్యూ

By కె, మణినాథ్

అలనాటి చలన చిత్ర సీమకురాజమకుటంలా నిలిచిన నటీమణి రాజసులోచన. ఆమె ప్రముఖ నటే కాదు, ప్రముఖ నర్తకి కూడా. ఎన్నో చిత్రాలలో ఆమె నర్తకి పాత్ర పోషించారు. ప్రముఖ నటులు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు యన్ టి రామారావు గారితో పాటు అందరు ప్రముఖ హీరోలతో ఎన్నో చిత్రాలలో నటించారు.
ఇటీవల అభినందన సాంస్కృతిక సంస్ధ అందించిన యన్.టి.ఆర్ అవార్డు మరియు బంగారు పతకం అందుకోవడానికి చెన్నై నగరం నుండి మన నగరానికి విచ్చేసి తన సినీ రంగ అనుభవాలను, యన్.టి.ఆర్ అవార్డు తీసుకున్నందుకు ఆమె తన అనుభూతిని, ఙ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు.
ప్ర. యన్.టి. రామారావుగారి అవార్డు మరియు బంగారు పతకాన్ని అందుకుంటున్నపుడు మీ స్పందన గురించి చెప్పండి.
జ. యన్.టి.ఆర్ అవార్డుని,బంగారు పతకాన్ని అందుకుఁటున్నందుకు చాలా సంతోషంగా వుంది. అంతే కాదు యన్.టి. రామారావుగారి ఆత్మకూడా సంతోషిస్తుంది. మరో జన్మ ఉన్నా లేకపోయినా ఆఆత్మ తాలూకు వైబ్రేషన్స్ తనకి ఇష్టమైన వారు ఎవరూ ఏమిటీ అని చూస్తుంటాయి.వాటి ద్వారా ఆత్మ సంతోషిస్తుంది.
ప్ర. రామారావుగారితో చాలా సినిమాలలో నటించారు కదా. కలకాలం గుర్తుండే అనుభూతులు, మరచిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా?
జ. నేను రామారావుగారితో చాలా సినిమాల్లో నటించాను. ప్రతి సినిమా ఒక్కో అనుభవం. "సొంతవూరు" సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించాము. ఆసినిమాలో ఆయన కృష్ణుడు వేషం వేశారు. నేను రాధిక వేషం వేశాను. రామారావుగారు చాలా సినిమాల్లో కృష్ణుడిగా చేశారు.మనం చూసే కృష్ణుడు వేరు. ఇందులో వేసిన కృష్ణుడు వేరుగా ఉండేవారు. అలాగే పెంకి పెళ్ళాం సినిమాలో చాలా సరదాగా ఉండేవారు. ఆసినిమాలో నన్ను పెళ్లాడవే చెంచిత అనే డాన్స్ ఉంది.ఆ డాన్స్ చాలా విగరస్గా చేసేవారు. నేను చాలా భయపడేదాన్ని. ఆ సీన్ మర్చిపోలేను.
బి.యన్. రెడ్డిగారి డైరెక్షన్లో "రాజమకుటం" లో చేశాను. కత్తి పట్టుకు చేసే డాన్స్లో కత్తి విసిరే సీనం ఉంది. అలా విసరటంలో నేను ఒకవేళ తప్పు చేస్తానా అనే భావం ఉండేది. ఎందకో సెంటిమెంట్‌గా కూడా కత్తి విసరటం నాకు ఇష్టం ఉండేది కాదు. చివరికి నేను విసరలేదు అనుకోండి. ఆరోజుల్లో రామారావుగారైనా సరే, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అయినా సరే అందరూ ఒక కుటుంబంలా వుండేవాళ్ళం. "వాల్మీకి" , "టైగర్ రాముడు" ఇంకా చాలా సినిమాల్లో చేశాను.
ప్ర. మీరు మరచిపోలేని సినిమా ఏది?
జ. కారెక్టర్ పరంగా "బభ్రువాహన" సినిమా మరచిపోలేనిది. "మంచి మనసుకు మంచి రోజులు" సినిమా కూడా చాలా ఇష్టం. పాటలు చాలా బాగుంటాయి. అందులో నాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. "తాతా-మనవడు" లో నా వయసుకి మించిన పెద్ద పాత్ర వేశాను. అలాగే "సువర్ణ సుందరి" కూడా నాకు నచ్చింది.
ప్ర. సినీరంగంలో మీకాలంలో మీకు నచ్చిన ఇతర సినీ తారలు ఎవరు?
జ. సినీ ఇండస్ట్రీలో అంజలీదేవి అంటే చాలా ఇష్టం. అభిమానంతో,భక్తి భావంతో ఆమెని చూసుకుంటాను. గురువుగా ఉండేవారు. నాకు ఒక గైడ్ గా ఉండేవారు. నాకు పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఆమె నాకు మిత్రురాలు. ఆత్మీయురాలు. అన్ని విషయాలు ఆమెతో చర్చించేదాన్ని.
ప్ర. తెలుగు చిత్ర సీమకి తెలుగు హీరోయిన్లు కరవయ్యారు. ముంబాయి వంటి ఇతర నగరాల నుంచి వస్తున్నారు. మన తెలుగు రాష్ట్ర్రంలో డాన్సర్లు, హీరోయిన్లు లేరంటారా?
జ. మన తెలుగు వారు చాలామంది ఉన్నారు. వెతికి పట్టుకోవాలి. ప్రొడ్యూసర్స్ చేసే తప్పులు ఇవి. మన ఆంధ్ర రాష్ట్రంలో మంచి డాన్సర్లు, నటీ నటులు ఉన్నారు. కాని ఎక్కడ వున్నారని తెలిసి కనుక్కోవాలి. ఎవరు బాగా చేస్తున్నారు. ఎవరు బాగా యాక్ట్ చేస్తున్నారు అని వెతకాలి.
ఆరోజుల్లో నాటకాలు బాగా జరిగేవి. చాలామంది ఆర్టిస్ట్ లు మంచి ఎక్స్ ప్రెషన్స్ తో డైలాగ్ మాడ్యులేషన్స్ తో చెప్పేవాళ్ళు. ఆరోజుల్లో మా డబ్బింగం కూడా మేమే చెప్పేవాళ్ళం. నాకు కూడా మొదట్లో హిందీ వచ్చేది కాదు. కాగితం మీద తెలుగులో రాసుకుని చెప్పేదాన్ని. అలాగే మలయాళం కూడా. నేడు అంతా డబ్బింగ్ మయం. ఎలా యాక్ట్ చేస్తే ఏంటి? అనే భావంతో హీరోయిన్లు వస్తుంటారు. ఏదో చేసి పోతుంటారు.ఏదో ఒక పిక్చర్ లో బాగా చేసుండచ్చు. అది చూసి ఇక్కడి పిక్చర్స్ లో యాక్ట్ చేయిస్తుంటారు.
ప్ర. మీరు నర్తకి కదా ఎప్పటి నుంటి నృత్యం నేర్చుకున్నారు?
జ. నాకు పది సంవత్సరాల వయసునుంచే డాన్సు నేర్చుకున్నాను. మద్రాసులోనే నా నృత్య శిక్షణ జరిగింది.
1963లో మద్రాసులో పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అనే సంస్ధని నెలకొల్పాను. హైదరాబాదులో నాగేశ్వరరావుగారి చేతులమీదుగా ప్రారంభించిన పుష్పాంజలి శాఖ కూడ వుండేది. కాని ఆంధ్రా యాజిటేషన్ సమయంలో మద్రాసు నుంచి రావటం ఇబ్బందిగా అనిపించి ఇక్కడ మూసేసాము. ఇప్పటికీ మద్రాసులో నడుస్తూనే ఉంది. ప్రస్తుతం బోర్టు తీసేసాను. కాని ఎవరైనా అడిగితే నేర్పిస్తుంటాను.
ప్ర. ఇప్పటి చిత్రాలలో నృత్యాలు ప్రజలని ఆకట్టుకునేలా వుండటం లేదు. అభినయంలో కాని, వస్త్ర ధారణలో కాని మార్పు వచ్చింది. ఆనాటి చిత్రాలలో మీరు నటించిన చిత్రాలు, నాట్యాలు నేటికీ అలరిస్తున్నాయి ఎందుకంటారు?
జ. నేడు నిర్మాతలు, దర్శకులు అలాగే కావాలంటున్నారు. నేడు డాన్స్ చేసేవారు కళాత్మకంగా కన్నా డబ్బుకోసమే చేస్తున్నారు. మా రోజుల్లో మేము కళకోసమే చేసేవాళ్ళం.. డబ్బుకోసం చేయలేదు.
ప్ర. నర్తకి గా మీ అనుభవాలు...?
జ. చిన్నతనం నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టం నాకు. అలనాటి కూచిపూడి డాన్సర్లు, సినీ తారలు అయిన కమల,లలిత, పద్మిని డాన్స్ అంటే ఇష్టం. వారి స్ఫూర్తితో నేను కూచిపూడి, భరతనాట్యంలతో పాటు కధక్, కధాకళి కూడా నేర్చుకున్నాను. నా నాట్య గురువుల శిక్షణ నన్ను ఎన్నో సినిమాలలో నర్తికిగా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే మా పుష్పాంజలి ద్వారా కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నారు. యల్.విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి (శంకరాభరణం ఫేమ్,) లలిత (డిస్కో శాంతి చెల్లెలు) ఇలా ఎంతో మంది మా పుష్పాంజలిలో నృత్యం నేర్చుకున్నారు.
ఐదుగురు ముఖ్యమంత్రుల తో పని చేసిన అనుభవం నాకుంది. ఇది సంతోషించే విషయం నాకు. అన్నాదురై, జయలలిత, యం.జి.ఆర్, రామారావుగారు, మొదలైన వాళ్ళతో కలిసి డాన్స్ బాలేలు చేశాను. ఫిల్మోత్సవ్ లలో నా నృత్య ప్రదర్శనలు ఉండేవి.
ప్ర. "చిన్నారి పాపలు"లో మీరు డాన్స్ డైరెక్షన్ చేశారు. ఆతరువాత మరి ఏ పిక్చర్‌కి డైరెక్షన్ చేయలేదు ఎందుకని?
జ. సావిత్రి గారు డైరెక్ట్ చేసిన "చిన్నారి పాపలు" సినిమాలో అందరూ మహిళలే చేయాలి అని అన్నారు. నేను ఆసినిమాలో ఒక డాన్స్ డైరెక్ట చేశాను. ఆ సినిమాని సరదాగా చేశాము అందరం. నేను ఏమీ డబ్బు కూడా తీసుకోలేదు. అంతేకాదు నేను నటిని. డాన్స్ ఇంకొకరు చేయచ్చు కదా. అందుకని కూడా నేను మరే సినిమాలో డాన్స్ డైరెక్ట్ చేయలేదు. నటన నా ప్రొఫెషన్. యాక్టింగ్ ఒకటే తీసుకున్నాను.
ప్ర. ప్రతి టి.వి. ఛానెల్స్ కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి. అందులోచిన్న చిన్న పిల్లలు కూడా డాన్స్ చేస్తుంటారు? ఇది హర్షించదగ్గ విషయమంటారా?
జ. డాన్స్‌ని సరిగా ఎవరూ గుర్తించకుండా దుర్వినియోగం చేస్తున్నారనిపిస్తుంది. డాన్స్ అనేది దైవికమైన కళ. ఆ కళ పోకూడదు. అది ఉండాలి. ప్రతి ముద్ర కూడా ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. అది ఎందుకు చేస్తున్నాము అనేది వుంటుంది. ఆ ముద్ర వల్ల బాడీలో వైబ్రేషన్స్ ఉంటాయి. అన్నీ చూసుకోవాలి. పేరెంట్స్ కూడా ఏదో పిక్చర్స్‌‌లో చూస్తున్నారు, మా పిల్లలు కూడా చేయాలి అని అనుకుంటున్నారు.ఈ శాస్త్రం, పద్ధతులు అవి అన్నీ నేర్చుకుంటే బాగుంటుంది.
ప్ర.సీనియర్ నటీమణులు అందరూ సినిమాల తర్వాత టి.వి.లలో నటిస్తున్నారు. మీరు ఎందుకు నటించడం లేదు?
జ. నటించకూడదని లేదు. ఒకసారి షూటింగ్‌లో హై బ్లడ్ ప్రెజర్ వల్ల పడిపోయాను. డాక్టర్లు, కుటుంబ సభ్యులు అందరూ ఇంతవరకూ నీకు అన్ని అవార్డులు వచ్చాయి. మంచి పేరు వచ్చింది. ఇంకా ఎందుకు నటించడం అని అనటంతో నేను నటించడం విరమించుకున్నాను.అంతేకాదు నాకు మూడు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. అనారోగ్య కారణాల వల్ల కూడా నేను మానుకున్నాను.
ప్ర. ప్రస్తుతం వస్తున్న హీరోయిన్లకు మీరిచ్చే సలహాల ఏమిటి?
జ. ఎవరైనా సరే ముందు భాష నేర్చుకోవాలి. అభినయం, నటన ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా చేయాలి.
ప్ర. సీనియర్ నటులంతా రాజకీయాల్లోకి వచ్చారు కదా! మీరు వచ్చే ఉద్దేశం ఉందా?
జ. సినిమాల్లో వున్న రాజకీయాలు చాలు. వేరే పాలిటిక్స్ ఎందుకు...
ప్ర. ప్రజా సేవ చేయచ్చుకదా...!
జ. ప్రజా సేవ ఆర్టిస్ట్గ్ గా కూడా చేయచ్చు. అందరూ పాలిటిక్స్ లోకి వస్తే ఎలా. రాజకీయ నాయకులకి కొన్ని లక్షణాలుంటాయి. వారు చేసిన దాన ధర్మాలు. పూజా పునస్కారాలు. మంచి పేరు. ప్రజాభిమానం, అలా ఎన్నో ఉండాలి. అందరూ రాజకీయవేత్తలు కాలేరు.
***
"సంపాదించినప్పుడే వచ్చిన దాంట్లోంచి కొంత దాచి పొదుపు చేయడం వల్ల చరమ జీవితంలోనూ అవసరాలకి ఉపయోగ పడుతుంది" అనే ప్రముఖ నర్తకి, నటీ రాజసులోచన మాటలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి.

ఇంకా

రాజ సులోచన జీవన సౌరభాలు.....

రాజసులోచన జీవిత విశేషాలు(క్విక్ )

రాజసులోచన జీవిత విశేషాలు

By కె, మణినాథ్


పుట్టిన తేది15 ఆగస్టు, 1935
తల్లి, తండ్రిదేవకమ్మ, భక్తవత్సలం
పుట్టిన వూరువిజయవాడ, కృష్ణాజిల్లా
పెరిగింది,విద్యాభ్యాసంచెన్నై
వివాహం1963
భర్తపేరుసి.యస్.రావు, ప్రముఖ సిని దర్శకులు. (ప్రముఖ దర్శకులు సి. పుల్లయ్య, ప్రముఖ సినీనటి శాంతకుమారిల కోడలు)
సంతానంఇద్దరు అమ్మాయిలు, (శ్రీగురుస్వామి,శ్రీదేవి; వాళ్ళూ నృత్యకారిణులే!) ఒక అబ్బాయి.
నివాసంచెన్నై
నటించిన సినిమాలుదాదాపు 300
నటించిన ఇతర భాషల సినిమాలుతమిళ్, కన్నడ, తమిళ్, మలయాళం
తెలుగులో హిట్ చిత్రాలలో కొన్నికన్నతల్లి, సొంతవూరు, పెంకి పెళ్ళాం,తోడి కోడళ్ళు (పాతది), పాండవ వనవాసం,సారంగధర, పెళ్ళినాటి ప్రమాణాలు,మాంగల్యబలం, రాజమకుటం, శాంతినివాసం, టైగర్ రాముడు, జయభేరి, వాల్మీకి, వెలుగునీడలు, తిరుపతమ్మకధ, బభ్రువాహన, తాతామనవడు, తోడికోడళ్ళు (కొత్తది)...ఇంకా ఎన్నో చిత్రాలు
హిందీలో నటించిన చిత్రాలుసితారోంసే ఆగే, చోరీ చోరీ, నయా ఆద్మీ మొ.వి
ఆనందించిన అంశంఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పని చేయడం. అన్నాదురై, యం.జి.ఆర్, జయలలిత, యన్.టి.రామారావు మొదలైన ముఖ్యమంత్రుల హయాంలో "బాలే"లురూపొందించి, నృత్య ప్రదర్శనలు ఇవ్వడం.
నృత్య సంస్ధ పేరుపుష్పాంజలి నృత్య కళా కేంద్రం
నచ్చిన సినిమామంచి మనసుకు మంచి రోజులు
నచ్చిన కారెక్టరుబభ్రువాహన
నచ్చిన నటీమణిఅంజలీదేవి
విదేశీ పర్యటనలుఅమెరికా, రష్యా,జపాన్,శ్రీలంక,చైనా, సింగపూర్

రాజ సులోచన జీవన సౌరభాలు.....


By కె, మణినాథ్



1935లో విజయవాడలో జన్మించిన రాజసులోచన బాల్యం నుంచీ మద్రాసులోనే పెరిగారు. ఆచార వ్యవహారాల ఇంట పెరిగిన ఆమెకు సంగీతం, ఫిడేలు వంటి వాటిల్లో ప్రవేశం వున్నా, నృత్యమంటేనే ఎంతో మక్కువ! తన పదవ ఏటనుంచే డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. తాను నేర్చుకున్నది చుట్టుపక్కల ఆడపిల్లలకు నేర్పేవారు.ఎక్కడ అవకాశం లభించినా నాట్య ప్రదర్శన లిచ్చేవారు.
ప్రసిద్ధ కూచిపూడి నాట్యగురువులు వెంపటి పెద సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి, చినసత్యం, జగన్నాధ శర్మ మొదలైన వారి శిక్షణలో రాజసులోచన నాట్యం ఆ సినిమాకే కలికితురాయిలా ఉండేది. భరత నాట్యం, కూచిపూడి, కధక్, కధాకేళి వంటి నాట్య కళలో ఆరితేరారు. దేశ విదేశాలలో పలు ప్రదర్శనలూ ఇచ్చారు. అమెరికా, చైనా, జపాన్, శ్రీలంక , రష్యా, సింగపూర్ వంటి దేశాలలో ప్రదర్శనలిచ్చారు.
రాజసులోచన ఇచ్చిన నాట్య ప్రదర్శనతోనే సినిమాలలో అవకాశం వచ్చింది. కన్నడ సినిమా 'గుణసాగరి'లో తొలి అడుగు వేసినా, తమిళం చిత్రం ’సత్యశోధనై’ మలి చిత్రం అయినా తెలుగులో 'కన్నతల్లి(1953)’ సినిమాతో తన నట జీవితం మొదలు పెట్టారు. అందులో చిన్న పాత్రలో కనిపించిన వీరు ’సొంతవూరు’ సినిమాతో కధానాయిక పాత్రలు వేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆమె ఎన్నో చిత్రాలలో కధానాయికగా నటించి ఆ చిత్ర విజయాలకి కారణమయ్యారు. ఎన్నో చిత్రాలు వందరోజులు ఆడాయి. నిర్మాతలకి కాసుల వర్షమూ కురిపించాయి.ఆమె నటించిన చిత్రాలలో 'రాజమకుటం' లోని సడిసేయకోగాలి... సడిసేయబోకే .. పాట నేటికీ ప్రజాదరణ పొందుతోంది. జానపద ఇతి వృత్తంగల ఆ సినిమా ఆర్ధికంగా పెద్దగా ఆడకపోయినా ఆమె నటన, యన్ టి రామారావు గారి నటన, బియన్ రెడ్డి గారి డైరెక్షను ఆ చిత్రాన్ని సెల్యులాయిడ్ పై చిరంజీవిలా నిలిచేలా చేశాయి.
ప్రముఖ సినీ దర్శకులు సియస్.రావుతో 1963లో వివాహం. దాదాపు 300 చిత్రాలలో నటించిన ఆమె చివరగా నటించిన సినిమా తోటికోడళ్ళు (కొత్తది)ప్రస్తుతం చెన్నై నగరంలో ప్రశాంత జీవితం గడుపుతున్నారు.

ఇంకా

రాజసులోచన జీవిత విశేషాలు(క్విక్ లుక్)

యన్.టి.ఆర్ అవార్డు గ్రహీత రాజసులోచన గారితో ఒక ఇంటర్‌వ్యూ

Tuesday, July 5, 2016

జాంబవంతుని గుహలు 
(జంబువాన్ కేవ్స్) గుజరాత్  
























గుజరాత్  రాష్ట్రం మన భారత దేశానికే తలమానికం అని అనిపిస్తుంది. 
 శ్రీకృష్ణుడు నివసించినది మొదలు నిర్యాణం కూడా ఇదే  రాష్ట్రం లో  
జరిగాయి. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణునికి, జాంబవంతునికి యుద్ధం  
జరిగిన ప్రదేశం కూడా ఇదే రాష్ట్రంలో వుంది. 
               సోమనాథ్  నుంచి ద్వారకకి మేము   రోడ్డు  మార్గంలో  వస్తుంటే  
ఈ జాంబవంతుని  గుహలు చూశాము. ఈ గుహలు మహారాష్ట్ర లోని   
పోర్ బందర్  17  కి.మీ. దూరంలో  రాజ్ కోట్  కి  వెళ్ళే  రహదారిపై    
రణ్ వావ్ గ్రామంలో (Ranavav) వున్నాయి. అక్కడ   సిమెంట్ ఫాక్టరీకి   
దగ్గరలో వుంది.   వూరికి  దూరంగా  కొండల మధ్య  విశాలమైన ప్రదేశంలో 
వున్నాయి.  ఇక్కడే  శ్రీకృష్ణుడు  జాంబవంతుల  యుద్ధం  జరిగినట్లు, 
జాంబవతిని  వివాహం  చేసుకున్న ప్రదేశం  ఇది  అని  చెబుతారు.   
మహాభారతం లోని కధ అందరికి  తెలిసిందే! వినాయక వ్రతం రోజున  
అందరం  కధ చెప్పుకుని  అక్షింతలు వేసుకుంటాము.  జాంబ వంతుడు 
శమంతక మణిని జాంబవతికి ఆడుకోవటానికి ఇస్తాడు. తనపై మోపబడిన 
నింద రూపుమాప డానికై   ఆమణి కోసం  వెతుకుతూ  శ్రీకృష్ణుడు ఈ గుహ 
వద్దకు  వచ్చి జాంబ వంతునితో  యుద్ధం  చేస్తాడు.  త్రేతా యుగంలో  
రామునితో  యుద్ధం చేయాలనే కోరిక వున్న జాంబవంతుడు  ద్వాపర 
యుగంలో  శ్రీకృష్ణుడితో  యుద్ధం  చేసి తన  చిరకాల  వాంఛ  నెరవేర్చు 
కుంటాడు.  మణితో  పాటు  తన కుమార్తె నిచ్చి  శ్రీకృష్ణుతో వివాహం  
జరిపిస్తాడు జాంబవంతుడు.
           మేము వెళ్ళినపుడు  సన్నని మెట్లు దిగి  ఒక్కొక్కరు మాత్రమే  వెళ్ళే  
వీలున్న మెట్ల ద్వారా వెళ్ళాము.  
లోపల చీకటి గా వున్నా అక్కడక్కడా పైనుంచి  హోల్స్  వుం టం  వల్ల 
అక్కడక్కడ  వెలుతురూ  వుంది .  గుహలో  రోజూ చిన్న  శివుని  విగ్రహం, 
అభిషేకం పూజలు  చేస్తున్నట్లుగా వుంది . విశాలమైన  ఈ గుహలో లోపలి 
వెళ్తే అక్కడ  జాంబవంతుడు శ్రీకృష్ణుడికి జాంవంతునికి జాంబవంతుని  
వివాహం  చేస్తున్న పెద్ద  పెయింటింగ్  వుంది. 








ఇక్కడ వున్న శివలింగాలు పై నుంచి పడిన నీటి బిందువులతో ఏర్పడిన 
చాలా శివలింగాలు  వున్నాయి .  




















గుహ బయట మనకి ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. గుహలోకి వెళ్ళిన వారు 
అక్కడి మట్టి రేణువులను సైతం ఎవరూ తీసుకు వెళ్ళకూడదు అని రాసారు. 
 ఒకవేళ  తీసుకు  వెడితే  ప్రభుత్వం  కఠిన శిక్ష  వేస్తుంది  అని రాసి వుంది.  
ఇంకో  బోర్డు లో గుజరాతీ  భాషలో ఇంకా  వివరంగా రాసి వుంది.  
మట్టి రేణువులు  తీసుకు  వెడితే ఇంట్లో  కూడా   గొడవలు  వస్తాయని  
రాసివుందని గుజరాతీ  భాష  తెలిసిన  వారు చదివి  చెప్పారు

ఈ గుహలో నుంచి రెండు దారులు  వున్నాయి. ఒకటి ద్వారకకి వెళ్తే, 
రెండోది జునాగడ్ కి వెళ్తుంది. ఈ రెండు  దారులూ రెండు , రెండున్నర 
గంటల్లో  గమ్యం చేరుకోవచ్చు.  గుజరాత్ ప్రభుత్వం  వారు  గుహలో  
అక్కడక్కడా లైట్స్  పెట్టారు.  

గుహలకి  బయట  చుట్టూ  వున్న పెద్ద తోటలో వచ్చిన వారు సేద తీరి, 
వెంట తెచ్చుకున్న భోజనాలు చేసి ఒక పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తారు. 
అక్కడే  గుడి  కూడా   వుంది. మేము వెళ్లేసరికి  గుడి తలుపులు  మూసేశారు.
మేము అక్కడే  15 మందిమి కలిసి  భోజనం  చేసాము.  తిరిగి  ద్వారకకి 
బయలు దేరాము .
  

Kalaram Mandir, Nasik



 'కాలారాం'  ఆలయం


 





నాసిక్ లో మరో ప్రసిద్దమైన, అతి ప్రాచీనమైన  ఆలయం కాలరాం.   ఈ  ఆలయం పంచవటి సమీపంలో  వుంది.పంచవటి అంటే ఐదు వట వృక్షాలు ఒకే చోట వున్న ప్రదేశం.  
తండ్రి  ఆజ్ఞ  మేరకు  వనవాస మేగిన సీతారామ లక్ష్మమణులు ఇక్కడ గోదావరీ తీరాన పర్ణశాల  నిర్మించుకుని ఉన్నారుట.  ఆ ప్రదేశంలో  1790 లో ఈ నల్లరాతి ఆలయం నిర్మించారు.                                                                                                                                      



 



 
   హనుమాన్ మందిర్  దగ్గర 
                         
​                  
ఈ ఆలయం సర్దార్ రంగారావ్ ఓధేకర్   నల్ల రాతితో నిర్మించారు.  ఒకసారి ఒధేకర్  కి కలలో  గోదావరీ  నదిలో నల్లరాతి విగ్రహం శ్రీ రాముడిది వున్నట్లు  కనిపించిందిట.  మరునాడు  గోదావరి లో వెతకగా నిజంగానే  రాముని విగ్రహం  దొరికింది. ఆ ప్రదేశమే  నేడు రామకుండ్. అక్కడ దొరికిన   ఆ విగ్రహాన్ని  తెచ్చి  పంచవటి  ప్రాంతంలో    శావీ మాధవరావు పేష్వా సలహా ప్రకారం  ఆలయం నిర్మించారు.  ఆలయ ప్రధాన మూర్తులైన సీతారామ లక్ష్మణులు నల్లరాతితో వుంటాయి. అందుకే కాలారాం ఆలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయానికి నాలుగు దిక్కులా  నాలుగు ద్వారాలున్నాయి .  చుట్ట్టూ  ప్రహరీ గోడ మధ్యలో ఆలయం వుంది. ఆ రోజుల్లోనే 23 లక్షలు అయ్యాయిట 2000 మంది కూలీలు పనిచేసారు. పన్నెండు సంవత్సరాలు పట్టింది. ఆ నల్ల  రాతిని  రామసేజ్ పర్వత  నుంచి తీసుకు  వచ్చారు.  పగలు రాత్రి ధగ దగా మెరిసే  ఆలయ గోపుర కలశం బంగారు పూత పూసిన రాగి కలశం.
ఆలయ ప్రహరి గోడలు కూడా  చాలా ఎత్తులో  కట్టారు ఎత్తైన ఆలయ ప్రధాన ద్వారం దాటి  లోపలి  వెళ్ళగానే  మంటపంలో హనుమంతుడు దర్సన మిస్తాడు.ఈ హనుమ  విగ్రహం కూడా నల్ల రాతితో  చేసిందే! ఈ మంటపం హనుమాన్ చాలీసా లో లాగా  40 స్తంబాలతో చేశారు. 
ఆ తరువాత సీతారాముల ఆలయ ప్రవేశం కొద్ది ఎత్తులో (సుమారు 10 మెట్లు)  వుంటుంది.   
దత్తాత్రేయుడు ఇక్కడికి వచ్చినట్లు అయన పాద ముద్రలు కనిపిస్తాయి. విగ్రహం కూడా  వుంది.
చుట్టూ  96 స్తంబాలతో  మంటపం నిర్మించారు.  గణేషుడి మందిరం కూదా  వుంది. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు, శ్రీ రామనవమి ఉత్సవాలు  వైభవంగా  చేస్తారు. 
పర్యాటకులని  విశేషంగా ఆకర్షిస్తుంది ఈ కాలారాం ఆలయం.
  

ఆ రోజుల్లో కాలారాం ఆలయ ప్రవేశం దళితులకి  నిషిద్దం 
కాని డా. అంబేద్కర్  దళితులని కూడగట్టుకుని  మార్చ్ 2 1930నాడు  ఉద్యమం మొదలు  పెట్టారు.  వేలాదిమంది ఈ  ఉద్యమంలో  పాల్గొన్నారు. 5 సంవత్సరాలపాటు పోరాటం సాగించి చివరికి  విజయం సాధించారు.  ఇప్పుడు  అందరికీ  ప్రవేశం వుంది.  ఆ విశేషాలు  తెలిపే  రాతి ఫలకం ఆలయ  గోడలపై  ప్రభుత్వం  వారు  చెక్కారు.   
                             

      గోరా రాం సీతా రామ లక్ష్మణులు 



విశాలమైన, అతి పెద్దది అయిన కాలారాం  ఆలయం  వున్న  వీధిలోనే గోరారాం మందిరం కూదా  వుంది.  ఇది చాలా చిన్నది.  విగ్రహాలు కూదా  చిన్నవిగా, పాలరాతితో  చేసినవి  వున్నాయి.  


 - కోపల్లె మణినాథ్ 

Saturday, June 18, 2016

Chinmastika Devi, Himalayas

"మా" చిన్తపూర్ణి 


 ప్రముఖమైన  శక్తి పీఠంగా విరాజిల్లె చిన్తపూర్ణి ఆలయం. 
చిన్తపూర్ని హిమాలయాలలోని పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం 51శక్తి పీఠాలలో ఒకటి. ఎంతో  మహిమల ఈ క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర వుంది.   డిల్లి నుంచి పఠాన్ కోట్ చేరుకొని అక్కడినుంచి టాక్సీ లో స్వామి  చిన్మయానంద వారి తపోవన్ ఆశ్రమం చేరుకున్నాము. అక్కడి నుంచి  మేము హిమాచల్ ప్రదేశ్ లోని చుట్టుపక్కల ప్రదేశాలు చూసాము. వాటిలో శక్తి  పీఠం గా  విరాజిల్లే మా చింత పూర్ణి మందిరం ఒకటి. 
భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన టూరిష్టులు  కూడా వస్తుంటారు.
 చరిత్ర కథనాలు 
  దక్షప్రజాపతి కుమార్తె, (పార్వతి దేవి) అయిన దాక్షయని పరమ శివుని వరించి వివాహం చేసుకుంటుంది. కాని దక్షుడు శివుని శక్తిని గుర్తించడు. ఒకసారి దక్షుడు యజ్ఞం చేయ తలపెడతాడు. ఆ దక్ష యజ్ఞానికి శివుని కాని దాక్షాయినిని కాని ఆహ్వానించడు. అయినా దాక్షాయిని పుట్టినింటి  మీద మమకారంతో  పిలవకపోయినా పుట్టినింటికీ వెడుతుంది. కాని అక్కడ ఆమెకి అవమానం జరుగుతుంది. ఎవరు ఆమెని ఆహ్వానించరు పలకరించరు. శివుని కూడా అవమానిస్తూ మాట్లాడతారు. అది భరించలేక తనకి తాను అక్కడ నిర్వహిస్తున్న యజ్ఞ కుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పటినుంచి ఆమె పవిత్రమైన  సతిగా పేరుగాంచింది.  
    సతి మరణ వార్త విన్న పరమ శివుడు దుఃఖితుడై హుటాహుటిన దక్షవాటికకు  వస్తాడు.  శివ తాండవం చేస్తూ, దక్ష యజ్ఞానాన్ని  నాశనం చేస్తాడు. అనంతరం  సతీ దేవి మరణాన్ని జీర్ణించుకోలేని శివుడు సగం కాలిన సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని శివతాండవం చేస్తూ భూమండలం అంతటా మతిలేని వాడిలా  తిరుగుతూ ఉంటాడు. అది చూసిన దేవతలందరూ శివునికి సతీదేవి పై గల ప్రేమ, సతి వియోగంతో శివుని బాధనీ స్థితిని చూసి ఆందోళన చెందుతూ  శివుని నుండి సతీదేవి శరీరాన్ని వేరు చేయాలని విష్ణు మూర్తిని ప్రార్దిస్తారు.  విష్ణువు శివుని వెంట అనుసరిస్తూ సమయం చూసి సతి దేవి శరీరాన్ని తన సుదర్శన చక్రం తో ముక్కలు ముక్కలు చేస్తాడు.  సతీదేవి శరీర భాగాలు భూమండలం అంతటా పడతాయి. అలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఆ జగన్మాత  కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం, విశ్వాసం. 
ఈ  శక్తిపీఠాలలలో పరాశక్తి భైరవునితో (తన భర్త అయిన శివుడు) వెంట కాలభైరవుని (శునకం) తోడుగా కొలువై వుంటుంది  చింతపూర్ణి లో అమ్మవారి పాదాలు పడిన చోటు.  ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో వుండదు. పిండి రూపం లో వుంటుంది. ఇక్కడకి వచ్చిన భక్తులు తమ చింతలు దూరం చేసే తల్లిగా కొలుస్తారు. ఈ సత్యం చాలా మందికి అనుభవ పూర్వకంగా రుజువైయింది.  
చిన్మస్తిక దేవి. (శిరస్సు లేని దేవత)
స్థల పురాణాన్ని బట్టి  ఈ కధ కూడా  ప్రచారంలో వుంది. 
 'మస్తిక'  అంటే శిరస్సు  అని, 'చిన్'  అంటే లేదు అని, అర్థం... శిరస్సు లేని దేవత గా ఇక్కడి మాత ని కొలుస్తారు.  ఇతిహాసాలలోని పురాణాల  ప్రకారం  మార్కండే పురాణం లో ఒక గాధ ప్రచారంలో వుంది. చండి దేవికి రాక్షసులకి జరిగిన ఘోర యుద్ధం లో చండి దేవి అసురుల్ని ఓడిస్తుంది.  అందులో సాయపడిన   ఢాకిని, యోగిని గా పిలువబడే జయ విజయులు ఏంతో మంది రాక్షసులని  సంహరించి వారి రుధిరాన్ని తాగుతారు. కాని,  యుద్దానంతరం కూడా వారు విపరీతమైన  రక్త దాహంతో వున్నపుడు చండి దేవి  తన తలని తానె ఖండించి తన శరీరం నుంచి వచ్చే రక్త దారాలతో వారి దాహాన్ని తీరుస్తుంది. అందుకే ఇక్కడి దేవికి చిన్ మస్తికాదేవిగా   శిరస్సు లేని దేవిగా పిలువ బడుతోంది.  
పురాణాలు, ఇతిహాసాలలో ఈ స్థలాని రుద్ర  దేవుడు ఈ ప్రదేశాన్ని నలు దిక్కులా కాపాడుతుంటాడని కూడా వుంది. తూర్పున కాళేశ్వర్ మహాదేవుని ఆలయం, పశ్చిమాన నారాయణ్ మహాదేవ ఆలయం, ఉత్తరాన మచ్ కుండ్ మహాదేవ్ ఆలయం దక్షిణాన శివ్  బారి ఆలయం వున్నాయి. అందుకే  ఆ ఆలయాన్ని చిన్ మస్తిక దేవి ధామ్ అని అంటారు 
పండుగలు 
ప్రతి సంవత్సరంలో పది రోజులు జూలై ఆగష్టు మధ్య ఉత్సవాలు జరుగుతాయి సావన్ (శ్రవణ్ ) అష్టమి ఉత్సవాలుగా పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి మహిమల గురించి తెలిసి ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు.  శ్రవణ మాసం లోను, దసరా నవరత్రులలోను కార్తిక మాసంలోను, చైత్ర మాసం లోను, పౌర్ణమికి ఇంకా ఇతర పర్వ దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు 
ఎంతెంత దూరం 
హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా  నుంచి 47 కి.మీ. దూరం లో  వుంది.  సొలా  సింఘి  పర్వత  శ్రేణులలో  పర్వత శిఖరం పైన  940 మీటర్ల (3,117 అడుగుల) ఎత్తులో చింతపూర్ణి అమ్మవారి ఆలయం వుంది.      
65 కి. మీ. ధర్మశాల నుంచి.
 
అతి దగ్గరి   విమానాశ్రయం గగ్గల్. కాంగ్రా జిల్లాలో వుంది. 
రైలు మార్గం ఉనా జిల్లాలోని అంబ నుంచి 20 కి.మీ. దూరం లో వుంది.
ఢిల్లీ నుంచి 430 కి మీ  దూరంలో వుంది. 
పంజాబ్ రాష్ట్రం లోని హోషియార్ పూర్ 43 కి.మీ. దూరం లో వుంది. 
చుట్టూ సుందరమైన ప్రక్రుతి దృశ్యాలతో అలరారుతూ వుంటుంది. 
ఢిల్లీ నుండి చందిగడ్, నంగల్, ఉన, ముబరిక్పూర్, తానికపుర , భార్వైన్  చిన్తపూర్ని ఒక మార్గం 
ఢిల్లీ నుండి జలంధర్, హోషియార్పూర్ ముబారిక్పూర్ భార్వైన్, తానికపుర ద్వారా   చిన్తపూర్నికి  ఇంకొక మార్గం 
ఉప హిమాలయాలు సొలసింఘి  ధార్ 
 

ఇక్కడి పర్వతాలు ఉప హిమాలయ పర్వతాలుగా పిలవబడే   సొలా సింఘి దార్ లేదా  జస్వాన్ దార్ పర్వత శ్రేణుల నడుమ ఎర్రని ధూళితో నిండి వుంటాయి బియాస్ నది  
కాంగ్రా, ఉనా జిల్లాలను  తాకుతూ ప్రవహిస్తుంది. ఇంకో ప్రక్క స్వాన్ నది పారుతూ వుంటుంది.   
ఈ పర్వతాల నడుమ శక్తి పీఠం అయిన చిన్తపూర్ని ఆలయం అలరారుతోంది.   


 చ్ఛిన్నమస్త దేవి  , చినమస్తా దేవి , చిన్మస్తిక దేవి ఇలా భిన్నమైన పేర్లతో దేవిని కొలుస్తారు.  శిరస్సు లేని దేవిగా ప్రసిద్ధి చెందింది.
  
ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రక్రుతి రమణీయ దృశ్యాలు ,  అగాధమైన లోయల నడుమ  అందమైన గృహాలు, భవంతులు కనువిందు చేస్తాయి. ఇటు ఆధ్యాత్మికం గాను, విహార యాత్రలకి ఏంతో అనువైన ప్రదేశం ఇది 
ఈ ఆలయంలో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు. 
ప్రతి ఒక్కరు ఆలయంలోకి ప్రవేసించే ముందు తలపై షాల్ కాని, కర్చీఫ్ కాని, టోపీ  కాని  ధరించాలి. స్త్రీలు కూడా తలపై కొంగుని కప్పుకోవాలి. సంప్రదాయ దుస్తులు ధరించాలి.  పాదాల వరకు వస్త్రాలను ధరించాలి. 
తోలు వస్తువులు అంటే  బెల్త్, లెదర్ పర్సులు వంటివి ఆలయం లోకి తీసుకు రాకూడదు. 
  • ఆలయంలో పాన్, గుట్కా, మత్తు పదార్ధాలు సేవించటం నిషిద్దం. 
  • ఆలయం లోకి ప్రవేసించే ముందు మాంసాహారం ఆల్కహాలు వంటివి తీసుకుని వుంటే లోనికి ప్రవేసించ కూడదు.

  • దేవతా విగ్రాహాలకి ఎదురుగా కాళ్ళు జాపి కూర్చోకూడదు, పడుకో కూడదు.



  • పండిట్ మాయి దాస్, కలియా సరస్వత్ బ్రాహ్మణ వంశానికి చెందినవాడు.  ఛాప్రో గ్రామం లో మాతా చింత పూర్ణి దేవి ని కనుగొన్నట్లు చెబుతారు. 26 తరాలకి ముందు వాడు  ఇతను. ఇప్పటికి ఇతని వంశీకులే ఆలయంలో దేవిని అర్చిస్తున్నారు. 
    కాలియా కుటుంబీకుల చరిత్రని బట్టి చుస్తే... భక్తుడైన మాయీ దాస్ తండ్రి పాటి యాలాకి దగ్గరలో అతూర్ గ్రామానికి చెందినవాడు. ఇతను దుర్గా మాత  భక్తుడు. ఇతనికి దేవి దాస్, దుర్గ దాస్, మాయీ దాస్ అనే ముగ్గురు కొడుకులు. ఆ తరువాత ఆ కుటుంబం హిమాచల్ ప్రదేశ్,   ఉన దగ్గరలోని గ్రామానికి వలస వచ్చారు. మాయీ దాస్ కూడా తండ్రి వలే దుర్గాదేవి భక్తుడు. ఎప్పుడు భజనలు కీర్తనలు చేస్తుండేవాడు. వివాహం కూడా జరిగింది. తండ్రి మరణానంతరం ఇతని కుటుంబాన్ని  అన్నలు సరిగా చూడక పోవటంతో ఇంటి నుంచి బయటికి వచ్చి ఇబ్బందులు పాడుతుండేవాడు. అయినా కూడా మాయీ దాస్ దుర్గా మాతని ఇంకా భక్తి తో సేవిస్తూ ఉండేవాడు దుర్గా  దేవి తన చింతలని పోగోడుతుందని నమ్మేవాడు. 
     ఒకసారి మాయీ దాస్ అత్తవారింటికి వెడుతూ మర్రి చెట్టు కింద సేద తీరుతాడు. చుట్టూ అడవి. నడిచి నడిచి అలసి పోయి నిద్రలోకి జారుకుంటాడు. ఆ సమయంలో ఒక అందమైన అమ్మాయి కనపడి, "మాయీదాస్!  నీవు ఇక్కడే వుంది నన్ను సేవించుకో. నీకు మంచి జరుగుతుంది" అని అంటుంది. మాయీ దాస్ వెంటనే లేచి చుట్టు  చూస్తాడు కాని అక్కడ ఎవరు కనపడరు .  అతనికి అంతా అయోమయంగా వుంటుంది. 
    అతను తిరిగి అత్తవారింటికి తన ప్రయాణం కొనసాగిస్తాడు. కాని తనకి వచ్చిన కల గురించే ఆలోచిస్తాడు. ఆ ఆమ్మాయి నిజంగా దేవేనా?  అలా ఐతే  ఆ అజ్ఞాని ఎలా అమలు పరచగలడు ఇలా పరి పరి విధాల ఆలోచిస్తూ అత్తగారింట్లో ఎక్కువ కాలం ఉండలేకపోతాడు.
    తిరుగు ప్రయాణంలో అదే వృక్షం కింద కూర్చుని తన ఆలోచనలను దుర్గా దేవి గురించే ఆలోచిస్తాడు. "ఓ జగజ్జనని! నీ కున్న శక్తి నాకు లేదు. నేను చాల చిన్న వాడిని. నన్ను నీ నిజమైన భక్తునిగా స్వీకరిస్తే నా సందేహాలని పోగొట్టు" అని ప్రార్ధిస్తాడు.  మాయీ దాస్ ప్రార్ధనలు విన్న దుర్గామాత అతని ముందు చతుర్భుజాలతో సింహ వాహినియై  ప్రత్యక్షమౌతుంది. మాయీ దాస్ ఆమెని కీర్తిస్తాడు. "తల్లీ నీవు నన్ను ఆజ్ఞాపించు. నేను నిన్ను ఎలా సేవించుకోవాలి? నీ పాదాల చెంత నా జీవితం అంకితం  చేసుకుంటాను" అని అర్దిస్తాడు. 
    దానికి సమాధానంగా దుర్గా దేవి "నేను ఇక్కడ తరతరాలుగా ఉంటున్నాను. కాని ఈ కలి యుగం లో ప్రజలు  ఈ ప్రదేశాన్ని, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఇక్కడ పిండి రూపంలో (గుండ్రని రాతి రూపం) వున్నాను. ప్రతి రోజు పూజాదికాలు నిర్వహించేలా చూడు"  అని ఆజ్ఞాపించింది. తరువాత  అతనికి మంత్రోపదేశం  చేసింది.  దుర్గామాత "వ్స్వు ఇంతవరకూ ఛిన్నమస్తిక దేవిగా అందరికి తెలుసు. నేను అందరి బాధలు, కష్టాలు తొలగిస్తాను కనుక ఇప్పటి నుంచి ప్రజలు నన్ను చింత పూర్ణికగా  పిలుస్తారు.   నా భక్తులు ఇక్కడ నాకు ఆలయం నిర్మిస్తారు. భక్తులు సమర్పించే కానుకలు నీ బుక్తికి సరిపోతాయి" అని కూడా చెప్పింది.  
    కొండ శిఖరాన ఆ ప్రదేశం అంతా కొండచిలువలతోను క్రూర మృగాలతోను నిండి వుంది.  అంత ఎత్తులో అక్కడ  నీళ్ళు దొరకడం కూడా చాల కష్టం. అప్పుడు దుర్గ మాత కొంత దూరం లో  ఒక ప్రదేశం చూపించి అక్కడ తవ్వితే నీరు లభిస్తుందని చెప్పింది. మాయీ దాస్ దేవి చూపించిన ప్రదేశంలో ఒక రాతిని తొలగించితే అక్కడ  మంచి నీటి వూట ఉవ్వెత్తున పైకి లేచించి. మాయీ దాస్ ఆనందానికి అవధులు లేవు.    ఆ నీటితో ప్రతి రోజు అమ్మవారికి అభిషేకానికి ఉపయోగించేవాడు. భజనలు, స్త్రోత్రాల తో పూజించేవాడు. అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న పాక వేసుకుని ఉండేవాడు. 
          ప్రస్తుతం అతని  తరువాత  26 తరాలవారు మాత ని సేవించుకున్నారు. నేటికి అతని వంశీకులే   అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తున్నారు.  ఆ వూరిలో అధిక భాగం అతని దయాదులే వున్నారు. 
    ఆ నీటి ట్యాంక్ సమీపం లో మాయీ దాస్ సమాధి వుంది. ఆనాడు తవ్విన తటాకమే నేడు  ఆధునీకరించి  ఆ నీటినే అభిషేకానికి, ఆలయ అవసరాలకి  వాడుతుంటారు.      
    అడవిలో చెట్టు కింద మాయీ దాస్ చే పూజలు అందుకున్న చిన్తపూర్ని అమ్మవారికి నెమ్మది నెమ్మదిగా  ఆలయం నిర్మించి ఏంతో  అభివృద్ధి చేసారు. నేటికి ఆ ఊరిని ఛాప్రోగానే  పిలుస్తారు.
    పూర్తిగా అడవితో నిండి వుండే ఆ ప్రదేశం రోడ్లు వాహనాల రాకపోకలతో నిత్యం  రద్దీగా మారింది. ఆలయానికి 1.2 కి.మీ. దూరంలోనే వాహనాలు ఆపి రద్దీగా వుండే బజార్ల గుండా కాళీ నడకన నడిచి ఆలయానికి వెళ్ళాలి. మంగళ శుక్ర, శని ఆది వారాలలో విపరీతమైన రద్దీ వుంటుంది. 
    మాకు దర్సనానికి మూడు గంటల సమయం పట్టింది. 
    సాధారణంగా భక్తులు అమ్మవారికి తియ్యటి పదార్ధాలు నివేదన చేస్తారు. రవ్వతో చేసిన హల్వా, లడ్డు, బర్ఫి ఖీర్,  కొబ్బరి  వంటి ఆహార పదార్దాలే కాక  ఎర్రటి చున్ని, ధ్వజం అంటే ఎర్రటి జెండా, పూలు, నెయ్యి వంటివి కూడా దేవికి సమర్పిస్తారు. ప్రసాదాన్ని ఇంటినుంచి కాని అక్కడ బజార్లలోని షాపులలో  కాని కొని నివేదన
    చేస్తారు.


    అందమైన్ స్వాన్ నది