Search

Thursday, December 1, 2016




దివికేగిన గాన గంధర్వుడు డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ ....
కర్ణాటక సంగీత విద్వావంసుడు, హిందుస్తానీ సంగీత కారుడు, అయిన డా.బాలమురళి కృష్ణ నిన్న చెన్నైలో తుది శ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో వారు ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. చిన్ననాటనే సంగీత కచేరీలు చేసిన వీరు, వీరు పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆ రోజుల్లో రేడియో మాత్రమే వినోద సాధనంగా వున్న రోజుల్లో ప్రతి రోజు ఉదయాన్నే వచ్చే భక్తి రంజనిలో వీరు పాడిన తత్వాలు ఎంతో జన బాహుళ్యం చెందాయి. ఏమి చేతురా లింగా... ఏమి చేతురా .... నిన్ను విడిచి ఉండలేనయ కైలాస వాసా.... కస్తూరి రంగ రంగా, రామదాసు కీర్తనలు, ఎందరో మహానుభావులు వంటి త్యాగరాజ కీర్తనలు కూడా ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో పాటలు ప్రతి ఇంట్లో ప్రతిద్వనించేవి
వీరు పాడిన కాసెట్స్ కలెక్షన్ కూడా ఉండేది ... పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మ భూషణ్ వంటి జాతీయ పురస్కారాలు అందుకున్న ఏకైక వ్యక్తి. పలుమార్లు డాక్టరేట్ బిరుదు పొందారు.
వీరు ఎన్నో అవార్డులు అందుకున్నారు. వాటిల్లో కొన్ని సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.
సంగీతమే ఊపిరిగా సాగే వీరు కొత్త కొత్త రాగాలు కూడా కనిపెట్టారు. మహతి, సుముఖం , సర్వశ్రీ ప్రతి మాధ్యమావతి, గణపతి, సిద్ది వంటి రాగాలు . ఈ విశిష్ఠ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్నాళ్ల కిందట నగరంలో టి టి డి కళ్యాణ మంటపం, హిమాయత్ నగర్ లో వారి సంగీత కచేరి జరిగినపుడు వారిని దగ్గరి నుంచి చూసే అవకాశం కలిగింది.
ఏమి సేతురా లింగ ...
https://www.youtube.com/watch?v=DOzbVCepY6w
నిన్ను విడిచి ఉండలేనయ్యా ..
https://www.youtube.com/watch?v=DOzbVCepY6w
పలుకే బంగారమాయెనా ...
https://www.youtube.com/watch?v=QlrikrgOA0E











No comments:

Post a Comment