Search

Tuesday, July 5, 2016

జాంబవంతుని గుహలు 
(జంబువాన్ కేవ్స్) గుజరాత్  
























గుజరాత్  రాష్ట్రం మన భారత దేశానికే తలమానికం అని అనిపిస్తుంది. 
 శ్రీకృష్ణుడు నివసించినది మొదలు నిర్యాణం కూడా ఇదే  రాష్ట్రం లో  
జరిగాయి. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణునికి, జాంబవంతునికి యుద్ధం  
జరిగిన ప్రదేశం కూడా ఇదే రాష్ట్రంలో వుంది. 
               సోమనాథ్  నుంచి ద్వారకకి మేము   రోడ్డు  మార్గంలో  వస్తుంటే  
ఈ జాంబవంతుని  గుహలు చూశాము. ఈ గుహలు మహారాష్ట్ర లోని   
పోర్ బందర్  17  కి.మీ. దూరంలో  రాజ్ కోట్  కి  వెళ్ళే  రహదారిపై    
రణ్ వావ్ గ్రామంలో (Ranavav) వున్నాయి. అక్కడ   సిమెంట్ ఫాక్టరీకి   
దగ్గరలో వుంది.   వూరికి  దూరంగా  కొండల మధ్య  విశాలమైన ప్రదేశంలో 
వున్నాయి.  ఇక్కడే  శ్రీకృష్ణుడు  జాంబవంతుల  యుద్ధం  జరిగినట్లు, 
జాంబవతిని  వివాహం  చేసుకున్న ప్రదేశం  ఇది  అని  చెబుతారు.   
మహాభారతం లోని కధ అందరికి  తెలిసిందే! వినాయక వ్రతం రోజున  
అందరం  కధ చెప్పుకుని  అక్షింతలు వేసుకుంటాము.  జాంబ వంతుడు 
శమంతక మణిని జాంబవతికి ఆడుకోవటానికి ఇస్తాడు. తనపై మోపబడిన 
నింద రూపుమాప డానికై   ఆమణి కోసం  వెతుకుతూ  శ్రీకృష్ణుడు ఈ గుహ 
వద్దకు  వచ్చి జాంబ వంతునితో  యుద్ధం  చేస్తాడు.  త్రేతా యుగంలో  
రామునితో  యుద్ధం చేయాలనే కోరిక వున్న జాంబవంతుడు  ద్వాపర 
యుగంలో  శ్రీకృష్ణుడితో  యుద్ధం  చేసి తన  చిరకాల  వాంఛ  నెరవేర్చు 
కుంటాడు.  మణితో  పాటు  తన కుమార్తె నిచ్చి  శ్రీకృష్ణుతో వివాహం  
జరిపిస్తాడు జాంబవంతుడు.
           మేము వెళ్ళినపుడు  సన్నని మెట్లు దిగి  ఒక్కొక్కరు మాత్రమే  వెళ్ళే  
వీలున్న మెట్ల ద్వారా వెళ్ళాము.  
లోపల చీకటి గా వున్నా అక్కడక్కడా పైనుంచి  హోల్స్  వుం టం  వల్ల 
అక్కడక్కడ  వెలుతురూ  వుంది .  గుహలో  రోజూ చిన్న  శివుని  విగ్రహం, 
అభిషేకం పూజలు  చేస్తున్నట్లుగా వుంది . విశాలమైన  ఈ గుహలో లోపలి 
వెళ్తే అక్కడ  జాంబవంతుడు శ్రీకృష్ణుడికి జాంవంతునికి జాంబవంతుని  
వివాహం  చేస్తున్న పెద్ద  పెయింటింగ్  వుంది. 








ఇక్కడ వున్న శివలింగాలు పై నుంచి పడిన నీటి బిందువులతో ఏర్పడిన 
చాలా శివలింగాలు  వున్నాయి .  




















గుహ బయట మనకి ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. గుహలోకి వెళ్ళిన వారు 
అక్కడి మట్టి రేణువులను సైతం ఎవరూ తీసుకు వెళ్ళకూడదు అని రాసారు. 
 ఒకవేళ  తీసుకు  వెడితే  ప్రభుత్వం  కఠిన శిక్ష  వేస్తుంది  అని రాసి వుంది.  
ఇంకో  బోర్డు లో గుజరాతీ  భాషలో ఇంకా  వివరంగా రాసి వుంది.  
మట్టి రేణువులు  తీసుకు  వెడితే ఇంట్లో  కూడా   గొడవలు  వస్తాయని  
రాసివుందని గుజరాతీ  భాష  తెలిసిన  వారు చదివి  చెప్పారు

ఈ గుహలో నుంచి రెండు దారులు  వున్నాయి. ఒకటి ద్వారకకి వెళ్తే, 
రెండోది జునాగడ్ కి వెళ్తుంది. ఈ రెండు  దారులూ రెండు , రెండున్నర 
గంటల్లో  గమ్యం చేరుకోవచ్చు.  గుజరాత్ ప్రభుత్వం  వారు  గుహలో  
అక్కడక్కడా లైట్స్  పెట్టారు.  

గుహలకి  బయట  చుట్టూ  వున్న పెద్ద తోటలో వచ్చిన వారు సేద తీరి, 
వెంట తెచ్చుకున్న భోజనాలు చేసి ఒక పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తారు. 
అక్కడే  గుడి  కూడా   వుంది. మేము వెళ్లేసరికి  గుడి తలుపులు  మూసేశారు.
మేము అక్కడే  15 మందిమి కలిసి  భోజనం  చేసాము.  తిరిగి  ద్వారకకి 
బయలు దేరాము .
  

No comments:

Post a Comment