Search

Tuesday, July 5, 2016

Kalaram Mandir, Nasik



 'కాలారాం'  ఆలయం


 





నాసిక్ లో మరో ప్రసిద్దమైన, అతి ప్రాచీనమైన  ఆలయం కాలరాం.   ఈ  ఆలయం పంచవటి సమీపంలో  వుంది.పంచవటి అంటే ఐదు వట వృక్షాలు ఒకే చోట వున్న ప్రదేశం.  
తండ్రి  ఆజ్ఞ  మేరకు  వనవాస మేగిన సీతారామ లక్ష్మమణులు ఇక్కడ గోదావరీ తీరాన పర్ణశాల  నిర్మించుకుని ఉన్నారుట.  ఆ ప్రదేశంలో  1790 లో ఈ నల్లరాతి ఆలయం నిర్మించారు.                                                                                                                                      



 



 
   హనుమాన్ మందిర్  దగ్గర 
                         
​                  
ఈ ఆలయం సర్దార్ రంగారావ్ ఓధేకర్   నల్ల రాతితో నిర్మించారు.  ఒకసారి ఒధేకర్  కి కలలో  గోదావరీ  నదిలో నల్లరాతి విగ్రహం శ్రీ రాముడిది వున్నట్లు  కనిపించిందిట.  మరునాడు  గోదావరి లో వెతకగా నిజంగానే  రాముని విగ్రహం  దొరికింది. ఆ ప్రదేశమే  నేడు రామకుండ్. అక్కడ దొరికిన   ఆ విగ్రహాన్ని  తెచ్చి  పంచవటి  ప్రాంతంలో    శావీ మాధవరావు పేష్వా సలహా ప్రకారం  ఆలయం నిర్మించారు.  ఆలయ ప్రధాన మూర్తులైన సీతారామ లక్ష్మణులు నల్లరాతితో వుంటాయి. అందుకే కాలారాం ఆలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయానికి నాలుగు దిక్కులా  నాలుగు ద్వారాలున్నాయి .  చుట్ట్టూ  ప్రహరీ గోడ మధ్యలో ఆలయం వుంది. ఆ రోజుల్లోనే 23 లక్షలు అయ్యాయిట 2000 మంది కూలీలు పనిచేసారు. పన్నెండు సంవత్సరాలు పట్టింది. ఆ నల్ల  రాతిని  రామసేజ్ పర్వత  నుంచి తీసుకు  వచ్చారు.  పగలు రాత్రి ధగ దగా మెరిసే  ఆలయ గోపుర కలశం బంగారు పూత పూసిన రాగి కలశం.
ఆలయ ప్రహరి గోడలు కూడా  చాలా ఎత్తులో  కట్టారు ఎత్తైన ఆలయ ప్రధాన ద్వారం దాటి  లోపలి  వెళ్ళగానే  మంటపంలో హనుమంతుడు దర్సన మిస్తాడు.ఈ హనుమ  విగ్రహం కూడా నల్ల రాతితో  చేసిందే! ఈ మంటపం హనుమాన్ చాలీసా లో లాగా  40 స్తంబాలతో చేశారు. 
ఆ తరువాత సీతారాముల ఆలయ ప్రవేశం కొద్ది ఎత్తులో (సుమారు 10 మెట్లు)  వుంటుంది.   
దత్తాత్రేయుడు ఇక్కడికి వచ్చినట్లు అయన పాద ముద్రలు కనిపిస్తాయి. విగ్రహం కూడా  వుంది.
చుట్టూ  96 స్తంబాలతో  మంటపం నిర్మించారు.  గణేషుడి మందిరం కూదా  వుంది. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు, శ్రీ రామనవమి ఉత్సవాలు  వైభవంగా  చేస్తారు. 
పర్యాటకులని  విశేషంగా ఆకర్షిస్తుంది ఈ కాలారాం ఆలయం.
  

ఆ రోజుల్లో కాలారాం ఆలయ ప్రవేశం దళితులకి  నిషిద్దం 
కాని డా. అంబేద్కర్  దళితులని కూడగట్టుకుని  మార్చ్ 2 1930నాడు  ఉద్యమం మొదలు  పెట్టారు.  వేలాదిమంది ఈ  ఉద్యమంలో  పాల్గొన్నారు. 5 సంవత్సరాలపాటు పోరాటం సాగించి చివరికి  విజయం సాధించారు.  ఇప్పుడు  అందరికీ  ప్రవేశం వుంది.  ఆ విశేషాలు  తెలిపే  రాతి ఫలకం ఆలయ  గోడలపై  ప్రభుత్వం  వారు  చెక్కారు.   
                             

      గోరా రాం సీతా రామ లక్ష్మణులు 



విశాలమైన, అతి పెద్దది అయిన కాలారాం  ఆలయం  వున్న  వీధిలోనే గోరారాం మందిరం కూదా  వుంది.  ఇది చాలా చిన్నది.  విగ్రహాలు కూదా  చిన్నవిగా, పాలరాతితో  చేసినవి  వున్నాయి.  


 - కోపల్లె మణినాథ్ 

No comments:

Post a Comment