Search

Monday, September 8, 2014






అందమైన బాపు బొమ్మ సృష్టికర్త బాపు తానే  ఒక బొమ్మై పోయారు 


బుడుగు సృష్టి కర్త బాపు ఇక లేరు!!
ఆప్తమిత్రుడు అయిన ముళ్ళపూడి వెంకట రమణ తో కలిసి చిత్ర దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించిన బాపు కుంచె నుంచి ఎన్నో చిత్రాలు ప్రాణం పోసుకున్నాయి. ప్రతి బొమ్మ మనకి   బొమ్మల్లాగా వుండవు కదిలే బొమ్మలుగా జీవం పోసుకుని  మనతో మాట్లాడుతున్నట్లుగానే వుంటాయి. బాపు బొమ్మల ముఖ కవళికలు కళ్ళు, నోరు ముఖం అన్నీ కుడా జీవం వుట్టి పడు తుం టాయి. కార్టూన్స్ ఎంతో హాస్యాన్నిస్తాయి. బాపు కార్టూన్ల పుస్తకాలు చాలా మంది బహుమతులుగా కుడా ఇస్తుంటారు.  
తెలుగు వారందరి అభిమాన చిత్రకారుడు, కార్టూనిస్ట్ చిత్ర దర్శకుడు ఇంకా ఇంకా చాలా చాలా కళలున్న ప్రముఖ వ్యక్తి శ్రీ బాపు గారు.   గత కొన్ని నెలలుగా అస్వస్తతతో వున్న వారు   31 8 2014 న మద్రాసులో తుది శ్వాస విడిచారు.  
అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు బాపు బొమ్మలా వుంది అంటారు. అలాగే పక్కింటి లావుపాటి పిన్నిగారు కారెక్టర్ మనకి ఎంతో పరిచయమైనట్లే వుంటుంది. ఇక చిన్న పిల్లలకి  వీరి కార్టూన్స్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా బుడుగు బొమ్మలు. సి గాన పెసూనాంబ బుడుగు లతో వచ్చే కార్టూన్స్ పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా చదువు తుంటారు  బుడుగు పుస్తకం (2-భాగాలు) ఇప్పటికి ఎన్నో ముద్రణలు వచ్చాయి.   అందరూ అభిమానించే కార్టూన్ కారెక్టర్ బుడుగు.   బాపు గారి కార్టూన్స్ గాని ఇలస్త్రేషన్స్ కాని పేయింటింగ్స్ కాని ఆహ్లాదకరంగా వుంటాయి. గజి బిజీ రంగులు , గాడీ గా వుండే బ్యాక్ గ్రౌండ్స్ వుండవు. సింపుల్ రేఖలతో చిన్న గీతలతో అందంగా బొమ్మలు గీస్తారు. బాపు 
పురాణాల పాత్రల చిత్రణలో నాయకుడు ఇతను అని, ఇతను ప్రతి నాయకుడు అని  ప్రత్యేకంగా గీస్తారు. వాటిని చూసి ఆయా పాత్రల క్యారెక్టర్ ఈజీగా గుర్తుపట్టచ్చు వీరు గీసిన నవరసాల పెయింటింగ్స్ మనకి ప్రతి కళా సంస్థల్లో దర్సనమిస్తాయి. 
1933 డిసెంబర్ 15న నర్సాపూర్ లో జన్మించిన బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మి నారాయణ.   వీరి శ్రీమతి   కాలం చేసారు. వీరికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె వున్నారు.తొలుత పొలిటికల్ కార్టూనిస్ట్ గా అంధ్ర పత్రికలో చేరారు 1942లోనే  రమణగారి  కథలకి బొమ్మలు  వేయటం తో మొదలైన వీరి చిన్ననాటి  స్నేహబంధంతో ఇద్దరు ఎన్నో కథలు కార్టూన్స్ సృష్టించారు.   1967లో వీరు   చిత్ర దర్శకుడిగా నిర్మించిన   సాక్షి సినిమా తెలుగు చిత్ర సీమలోఎంతో ఘన విజయం సాధించింది. ఆ చిత్రం 1968 లో తాష్కంట్ లో ప్రదర్సించబడింది 
     బాపు రమణల కాంబినేషన్ లో దాదాపుగా 51 చిత్రాలు వచ్చాయి. వీరి ప్రతి చిత్రం ఎంతో ఘన విజయం సాధించింది. సంపూర్ణ రామాయణం చాలా కాలం థియేటర్స్ లో ఆడింది. చివరి చిత్రం శ్రీ రామరాజ్యం. (2011 . బాపు హింది  చిత్రాలకు కుడా దర్సకత్వం వహించారు లండన్ లోనూ బాపు దర్సకత్వం వహించిన చిత్రాలు ప్రదర్శించారు. 

బాపు  ఎన్నో అవార్డులు సత్కారాలు అందు కున్నారు. 
చలన చిత్ర రంగంలో బాపు చేసిన కృషి ని గుర్తించి భారత దేశ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుని 1913లో అందించింది. 
ఇంకా   నేషనల్ అవార్డ్స్, లైఫ్ టైం అచివ్మెంట్  అవార్డు,  నంది అవార్డ్స్,  ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. బాపు దర్సకత్వం వహించిన ఎన్నో చిత్రాలు నంది అవార్డు లని అందుకున్నాయి. అంతర్జాతీయ  ఖ్యాతిని పొందిన బాపు   విదేశాలలో సైతం ఎన్నో అవార్డ్ లు సత్కారాలు, సన్మానాలు అందు కున్నారు. 

వీరి చిత్రాల్లో సాక్షి, సంపూర్ణ రామాయణం ముత్యాల ముగ్గు, సీతా కల్యాణం, రామ రాజ్యం ఇంకా ఎన్నో చిత్రాలు చిత్ర రాజాలుగా నిలిచాయి. ఇప్పటికి సాక్షి చిత్రం లో డైలాగులు, పాటలు ముత్యాల చిత్రం డైలాగులు పాటలు చిత్రాల స్టిల్స్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. బాపు ఆర్ట్ ఎగ్జిబిషన్  దేశంలో చాలా చోట్ల జరిగాయి 


  
బాపు లేనిదే రమణ లే రు  , రమణ లేనిదే బాపు లేరు  . అందరికి బాపు- రమణ గానే తెలుసు. కాని రమణ గారు తొందరాగా ఈ లోకం విడిచి వెళ్ళారు. ఇప్పుడు బాపుగారు కుడా పైలోకం లో రమణ గారిని కలుసు కోవటానికి వెళ్ళారు. అరవై దశాబ్దాల స్నేహం నిన్నటి నుంచీ పై లోకం లో కుడా   కొనసాగుతోంది. 
బాపుగారి  బొమ్మలు ఎన్నో పుస్తకాల కవర్ పేజిలలో చోటు చేసుకున్నాయి. దిన వార మాస పత్రికలే కాదు రచయిత(త్రు)లు ల నవలలకి బొమ్మలు గీసారు.  బాపుగారి చిత్రాలు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. బాపు స్వాగత చిత్రం ప్రతి ఇంతా అలరిస్తుంటుంది. 
బాపుగారి బొమ్మలతో పాటు వారి కార్టూన్ లకి రాసే లిపి ప్రత్యెకమైంది. ఈ   కర్సివ్ రైటింగ్ అందంగా వుంటుంది. (కంప్యుటర్ లలో సైతం బాపు లిపి తో ఒక లిపి కుడా అను ఫాంట్స్ వారు క్రియేట్ చేసారు) 
చిన్న నుంచి పెద్ద దాకా ఇష్ట పడే బాపు బొమ్మ సృష్టి కర్త   బాపు  ఇక లేరు అనే వార్త సిని రంగంతో పాటు అభిమానులని  అందరిని దుఃఖ సంద్రంలో ముంచేసింది. వారి గురించి ఈ నాలుగు వాక్యాలు రాయటం  వారికి నేను ఇచ్చే అక్షర నివాళి. 
Mani Kopalle's photo.
బుడుగే కాదు ఇంకా ఎంతో మంచి అందమైన కార్టూన్ బొమ్మలు రెండు జళ్ళ  సీత 
కూడా ఫేమస్సె. వారి దర్సకత్వంలో ఎన్నో చిత్ర రాజాలు ఎప్పటికి మరువలేనివి. వారిపై మా టివి లో వచ్చిన కార్యక్రమం మీరు షేర్ చేసుకొని మరొక్కసారి వారిని చూడండి




https://www.youtube.com/watch?v=AWf-SrADnms&list=TL2Wo5s8lGiJkTk7-VcggvSeDMGQnd7FiE

No comments:

Post a Comment