శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ మందిర్ ద్వారక , గుజరాత్
ఈరోజు మహా శివరాత్రి. ఈ సందర్భం గా శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ గురించిన విశేషాలు.
శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ మందిర్ ద్వారకా నగరం గుజరాత్ లో వుంది. ఇక్కడి లింగం స్వయం భూ లింగం ఇది. ద్వారకాదీసుడైన శ్రీ కృష్ణుడిని దర్శించిన అనంతరం పట్టణంలో వున్న ఇతర దర్శనీయ ప్రదేశాలు, ఆలయాలలో శ్రీ సిద్దేస్వర్ మహాదేవ మందిర్ ఒకటి. ఇది చాలా పురాతన మైన ఆలయం.
మనం శివాలయాలు అని అన్నట్లే మేము వెళ్ళిన గుజరాత్ లోని శివాలయాలను సిద్దేస్వర్ మహదేవ్ గా పిలుస్తారని పించింది. మాతృ గయలోనూ సిద్దేస్వర్ ఆలయం స్వయం భూ శివలింగం వుంది. ద్వారక లోనూ సిద్దేస్వర్ మహాదేవ ఆలయం వుంది. నేను వివరించే ఆలయం ద్వారకా పట్టణం లో వున్న సిదేస్వర్ ఆలయం విశేషాలు.
ఇక్కడ లింగానికి అభిషేకాదులు స్వయంగా మనమే చేసుకోవచ్చు. విశాలమైన ప్రాంగణం . ప్రవేశ ద్వారం నుంచి ఆలయానికి వెళ్ళే దారి అంతా సాధువులు కాషాయ వస్త్ర ధారణతో, పొడుగాటి జడలు, ముడులతో హర హర మహా దేవ్ అంటూ వచ్చే వారిని బిక్ష అడుగుతూ కనిపించారు మాకు.
ఆలయ ప్రాంగణంలో అడుగిడగానే పెద్ద బావి, భూతనాథ్ ఆలయం,కనిపిస్తాయి. ఈ బావికి సావిత్రి బావి అని పేరు.
సావిత్రి బావి |
ఈ పురాతన ద్వారకా సిద్దేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించిన స్థల వివరాలు ఏమి లభ్యం కాలేదు.
సిద్దేశ్వర్ స్వయం భూ ఆలయం అహ్మదాబాద్ దగ్గరలో వున్న మరో ఆలయం మాతృ గయలో కూడా వుంది. ఆ ఆలయ ఫొటోస్.
గుజరాత్ లోనే వున్న సిద్దాపూర్ లోని (మాతృగయ) photo ఇది. సిద్దేశ్వర్ మహాదేవ మందిర్ , మాతృ గయ, లోని శివాలయాలు సిద్దాపూర్, గుజరాత్
ద్వారక లో వున్న శ్రీ సిద్దేశ్వర్ మందిర్ దగ్గర వున్న మారుతీ మందిర్ ఫోటోలు ఇవి. హనుమంతుడు ద్వారక లోని కృష్ణుడి లాగానే అలంకరించారు.
జై హనుమాన్ జి |
No comments:
Post a Comment