Search

Friday, April 12, 2013


శ్రీ శ్రీ శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతీ స్వామి
(ధూళిపాళ )




ఈ రోజు 13 ఏప్రిల్ న (తారీకుల ప్రకారం)  శ్రీ శ్రీ శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి స్వామీ నిర్యాణం చెందిన రోజు .  పూర్వాశ్రమం లో  శ్రీ ధూళిపాళ  సీతారామశాస్త్రిగా అందరికి సుపరిచితులు. వారిని 2001 లొ ఒక పత్రిక ప్రతినిధిగ గుంటూర్ లో కలిసినపుడు వారి అనుభవాలు చెప్పారు. ఆనాడు వారితో తీసుకున్న ఇంటర్వ్యు లో రామ భక్త హనుమాన్ తో తనకున్న భక్తీ అనుభవం, సినిరంగా గత వైభవాలు ఎన్నో పంచుకున్నారు.  

ఆశ్రమ జీవనం :


శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి స్వామిగా 2001 మే 7న కంచి పీతాధిపతి  శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ద్వారా ధూళిపాళ గారు సన్యాసం స్వీకరిమ్చారు. శ్రీ ఆంజనేయ స్వామి భక్తులైన వీరు గుంటూర్ పట్టణంలో శ్రీ అం జనేయస్వామి వారి ఆలయం నిర్మించారు. ఆ ప్రాంతాన్ని మారుతీనగర్ అని పిలువసాగారు. పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం గడిపిన శ్రీ స్వామి వారు ప్రముఖ సిని నటులు అయిన శ్రీ ధూళిపాళ గా అందరికి సుపరిచితులు. సన్యాసాశ్రమం స్వీకరించినప్పటి నుంచి మానవ సేవే మాధవ సేవే లక్ష్యం గా ఆధ్యాత్మిక జీవన పధం లోకి అడుగు పెట్టారు. సినీ రంగానికి దూరంగా వున్నారు.  ప్రజాహిత కార్యక్రమాలు చేసారు . శ్రీ ఆంజనేయ స్వామీ వారి ఆలయం నిర్మించట మే కాకుండా కళ్యాణ మంటపం , ధూళిపాళ  కళా వేదిక, ధ్యాన మందిరం కూడా నిర్మించారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
నటనా ప్రస్తానం :
శ్రీ శంకరయ్య, రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు . 1920 సెప్టెంబర్ 24 న పల్నాడు తాలుకా దాచేపల్లి గ్రామం లో జన్మించారు శ్రీ ధూళిపాళ . బ్రతుకు తెరువుకోసం గుంటూరులో ప్లీడరు గుమాస్తా గ స్టిరపడ్డారు . వారి నట జీవితం 1935 లో నాటకాలలో పాత్రపత్రాలు ధరించటం తో మొదలయింది . 
చింతామణి లో రాధ, శ్రీ కృష్ణరాయబారం లో నళినీ , మల్లమ్మ మొదలైన నాటకాలలోస్త్రీ 
పాత్రలు పోషించిన వీరు 1941లో స్టార్ దియేటర్స్ ని స్తాపించి ఎక్కువగా పౌరాణిక  పాత్రలు వేసేవారు . 1949లో వేసిన శ్రీ కృష్ణ రాయబారం లో దుర్యోధన పాత్ర  వీరి నట జీవితం లో కీర్తి ప్రతిష్ఠలు , అనేక అవార్డులు తెచ్చిపెట్టి నాటక రంగం లోనే రారాజులా నిలిచేలా చేసింది.
సిని రంగ ప్రవేశం :
ఒకసారి చెన్నైలో నాటక పోటీలు జరిగేటప్పుడు జడ్జిగా విచ్చేసిన ఆనాటి నటి శ్రీమతి జి. వరలక్ష్మి గారు వారి ప్రతిభని గుర్తించి సినిమాలలో నటించమని కోరటం జరిగింది . అంతే  కాదు వారిని డైరెక్టర్ అయిన బి.ఎ. సుబ్బారావు గారికి పరిచయం చేసారు . వారి చిత్రం భీష్మ (1962)లో దుర్యోధన పాత్ర పోషించారు . అల వీరి సిని రంగ ప్రవేశం జరిగింది.
విభిన్న పత్రాల విలక్షణ నటులు :
పౌరాణిక పాత్రలైనా శకుని, దుర్యోధన పాత్రలే కాక సాంఘిక పాత్రాలు పోషించి ఎన్నో సువర్ణ, రజిత పతకాలు అందుకున్నారు . నర్తనశాలలో రారాజు పాత్ర , , కునిగా శ్రీకృష్ణ పాండవీయం , దాన వీర శూర కర్ణ, బాల భరతం మొదలైన చిత్రాలలో నటించారు . చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాలలో విలన్ పత్రాలు, కరుణ రసమున్న పత్రాలు పోషించి నలుగురి మెప్పు పొంది దాదాపు 300 చిత్రాలలో నటించారు. కన్నడ, తమిళ భాషా చిత్రాలలో కూడా నటించి ఎన్నో బహుమతులు అవార్డులు పొందారు. ఏక పాత్రాభినయం చేసేవారు . ఆలిండియ రేడియో లో దాదాపు 150 నాటికలలో పాల్గొన్నారు.

రారాజు :


 పౌరాణిక పాత్రలలో ముందుగా సుయోధనుడుగా ప్రసిదులయ్యారు . రావనాసురుడుగా , మైరావణుడిగా నటించి ఆ పాత్రలకి న్యాయం చేకూర్చారు. ఎంచుకున్న పాత్రలో లీనమై నటించే అభినయం , సంభాషణలు పలికే తీరు , గంభీరమైన స్వరం, భిన్నమైన నటనా శైలి వీరిని ఆంధ్రుల గుండెల్లో చిరస్తాయిగా నిలిపాయి . నేటికి శకుని అన్నా, కౌరవ కుల వంశజుడు రారాజు అన్నా ధూళిపాళే!
ఆనాటి మరపురాని అనుభవం 1949లో చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారిచే సన్మానం అందుకోవటం మరచిపొలేని అనుభవం అని అన్నారు . బంగారు నటరాజు విగ్రహం , ప్రశంసా పత్రం, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు వంటి ఆ సభలో వుండటం ఏంతో ఆనందానిచ్చిమ్దని అనేవారు . తన రంగాస్తల నట జీవితం లో శ్రీ సి.యస్ ఆర్. ఆంజనేయులు , శ్రీ బందా కనకలింగేశ్వర రావు గారు , శ్రీ పీసపాటి వారు మొదలైన మహా మహా నటులతో కలిసి నటించటం కూడా ఎంతో గొప్ప అనుభవం అని అన్నారు .
మంచి రచయిత :
ధూళిపాల గారు మంచి నటులే కాదు రచయితా కుడా! ఎన్నో గేయాలు రచిం చారు. సమాజం లో మంచిని పెంచే ఉద్దేశం తో సమాజం లో దుష్ట శక్తి నిర్మూలనకి , ప్రజలలో సాంఘిక బాధ్యతా పెంపొం దిమ్చుకోడానికి వ్యక్తిగతంగా నమ్మకం పెంచుకోవడానికి , మంచిని ప్రబోధించే గేయాల రచన అంతర్వాణి. సామాన్యులు కూడా పాడుకునే విధంగా మంచి రాగాలతో కట్టబడినాయి.
సిని రంగం:
భీష్మ, మహా మంత్రి తిమ్మరుసు, నర్తనశాల , బొబ్బిలి యుద్ధం. శ్రీ కృష్ణావతారం, ఉమ్దమ్మ బొట్టు పెడతా, ఆత్మీయులు, బాంధవ్యాలు, ఏకవీర, అందాల రాముడు , సీతా స్వయం వరం , దాన వీర శూర  కర్ణ , ఎన్నో చిత్రాలలోని పాత్రలు వారి నటనా కీర్తి కిరీటం లో కలికి తురాయిగా నిలిచాయి.
బిరుదులు :
1968లో రాష్ట్ర ప్రభుత్వం వారి నంది అవార్డు బాంధవ్యాలు చిత్రానికి అందుకున్నారు.
1976 లో రంగ మార్తాండ, 1981లో రంగస్థల రారాజు 1983లో నాటక కళా ప్రపూర్ణ,  1983లో కళా సరస్వతి 84 సువర్ణ ఘంటా కంకణం,  ఇంకా ఎన్నో సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు.
1991లో పద్య నాటక శిక్షణ సిబిరాననికి డైరెక్టర్ గా కొంతకాలం ఉన్నారు.  1993లో నాటక అకాడమీకి అద్వైజర్ గా వున్నారు.
ఆ మహా నటుడి సినీ ప్రస్తానంలో వారి నట జీవితం కన్నా ఆధ్యాత్మిక జీవనం సాగిస్తూ శ్రీ శ్రీ శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతిగా జగత్ ప్రసిదులై జగత్ కల్యాణం కోసం మంచి కార్యక్రమాలు చేస్తూ , ఆ అభయాంజనేయ స్వామీ భక్తులుగా తమ అంతిమ జీవన యాత్రని తన 88వ ఏట ముగించిన వారికిదే నా నమస్సులు!
జననం  : 24 09 1920
మరణం : 13 4 2007


No comments:

Post a Comment