Search

Wednesday, July 18, 2012

Jaane kyon log - old Bollywood movie song 1971 Mehboob Ki Mehndi - Leena...

Rajesh Khanna








 రాజేష్ ఖన్నా ఇక లేరు. సూపర్ స్టార్ హిందీ సిని రొమాంటిక్ హీరో రాజేష్  ఖన్నా ఇక లేరు.  బాలీవుడ్ సూపర్ స్టార్ 69  ఖన్నా బుధవారం  మధ్యాహ్నం  తన ఇంట్లో (ఆశిర్వాద్) కన్నుమూసారు. కాన్సెర్ తో బాధపడ్దారు.  వారికి డిం పుల్   కపాడియా మాజీ భార్య సేవలు చేసారు. ప్రముఖ హీరో ఆక్షయ్   ఖన్నా అల్లుడు ట్విన్ కిల్ ఖన్నా భర్త. మరో కూతురు రింకీ మనుమలు, మనుమరాండ్రు బంధువులు  మధ్య రాజేష్ ఖన్నా చివరి శ్వాస తీసుకున్నారు.    మన దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన సంతాపాన్ని వెలిబుచ్చారు  .
1969    -  1970  వారు నటించిన సినిమాలు సూపర్ డూపర్  హిట్.  ఆరాధనా, కటిపతంగ్ వంటి సినిమాలు ప్రేక్షకుల మదిలో 
ఇప్పటికి చెరగని ముద్ర వేసుకున్నాయి. 1942 డిసెంబర్ 29 న జన్మించిన రాజేష్ ఖాన్న దత్తత వెళ్లారు. అయన అసలుపేరు జతిన్ ఖన్నా. తన పేరును రాజేష్ గా మార్చుకున్నారు.  ఆఖరి కథ చిత్రం ద్వారా రాజేష్ ఖన్నా తెరపై అడుగు పెట్టిన ఆరాధనా చిత్రం ఆయనని హీరోగా నిలబెట్టింది. గాయకుడు  కిశోరే కుమార్ పాడిన పాటలు అన్ని హిట్ అయ్యాయి.  దాదాపు 30 చిత్రాలకు పైగా  వీరి కాంబినేషన్  లో వాచ్చాయి.  మూడు సార్లు బెస్ట్ హీరో అవార్డు ని అందుకున్నారు. వరుసగా పదిహేను చిత్రాల్లో నటించి సూపర్ హిట్ చేసిన ఘనత వీరికే దక్కింది.  లోక్ సభ సభ్యుడిగా 1992 - 96    వరకు తన  సేవ లందించారు.

Sunday, July 8, 2012

Hindi Bhajans


అందరి మనసులు దోచుకున్న అలనాటి హిందీ భజనలు 

Bhajan by Lata Mangesker
Jyothi se Jyoti se.. Lathaji
Aye Malik Tere.....

Monday, July 2, 2012

గురు పూర్ణిమ

గురు పూర్ణిమ
vyas bhagavan

Click these two Links to listen music


                                             Srimannarayan Hari
ఈ రోజు గురు పూర్ణిమ. గురువులని పూజించే రోజు.  గురు పూజోత్సవం 
వ్యాస భగవానుడు జన్మించిన రోజుగా భావించే ఈ రోజుని వ్యాస్ పూర్ణిమ అని గురు పూర్ణిమ అని అంటారు.
   "గురు బ్రహ్మ గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వర: 
గురు సాక్షాత్ పరబ్రహ్మ: తస్మైశ్రీ గురవే నమ:
                ఒక వ్యక్తి జీవితం లో గురువు యొక్క ప్రాముఖ్యతని తెలుపుతుంది ఈ శ్లోకం. ఆషాడ శుక్ల పక్షం నాడు వచ్చే పూర్ణిమని 
Vyas Mandir, Haridwar
Vyasa Mandir at Haridwar
గురు  పూర్ణిమగా  వ్యవహరిస్తారు.   పూర్వ కాలం లో గురుకులం లో శిక్షణ ఇచేవారు. పూర్తి అయిన శిష్యులు గురు దక్షిణ సమర్పించుకోవటం, గురుపూజ చేయటం చేసేవారు. 
       
ఫలం పుష్పం, తోయం, ధనం, ధ్యాన్యం  వస్త్రం ఇలా ఏదైనా గురువుకి సమర్పించుకోవచ్చు. ఈ రోజు గురువు వందనం చేసి ఆశీర్వాదాలు పొందాలి. మనకి విద్య నేర్పిన గురువు ఎవరైనా సరే భక్తితో నమస్కరించాలి. జ్ఞానం ఇచ్చిన వారెవరైనా సరే, వయసులో చిన్న అయిన సరే, జీవిత సోపానం లో మనకి తెలియంది తెలియ చెప్పిన గురువు ఎవరైనా సరే వందనం అర్పించాల్సిందే!
Vyas mandir Haridwar 
గురువు అంటే అజ్ఞానంధకారాన్ని పోగొట్టి జ్ఞాన దీపాలు వెలిగించేవాడు. 
శిష్యుని మదిలో భక్తిని ప్రేరేపించి, మానవత్యాన్ని మేల్కొలిపి, మానసిక అందోళనలని పోగొట్టి శిష్యుని మేలు కోరేవాడు గురువు.
ఈ రోజు గురు వ్యాస దేవుడు మహాభారతాన్ని రచించాడు. పద్దెనిమిది పురాణాలు, భగవత్ గీత, బ్రహ్మసుత్రాలు మీమాంస అనే వి కూడా రచించిన ఆది గురువు. 
పరాశర మహర్షి  పుత్రుడు  వ్యాసుడు.  
రైతన్నలకు ఈ మాసం లో పడి తొలకరి చినుకులు వారి భవిష్యత్తుకి పునాదులు. వరి నాట్లు నాటే సమయం. ముందుగ ఈ రోజు పుడమి తల్లిని పుజిస్తారు. నాగలి పట్టి పొలం పనులు చేపడుతారు.    

విద్యార్ధులు తమ టీచర్స్ కి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి 

వ్యాస మహర్షి