Search

Wednesday, September 19, 2012

వినాయక చవితి శుభాకాంక్షలు 


   

Wednesday, September 5, 2012

టీచర్స్ డే

ఈ రోజే గురుపూజోత్సవం 
విద్య వేర్పిన గురువులను స్మరించుకునే రోజు.
మన దేశ రాష్ట్రపతి  దివంగత డా || సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు.  టీచర్స్  డే! 
దేశవ్యాప్తంగా  ప్రతి స్కూల్ లోను విధ్యా ర్ధులు  తమ  టీచర్స్ ని సన్మానించుకునే రోజు. 
అటు ప్రభుత్వం కూడా ఉత్తమ ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగ సన్మానించి అవార్డులతో సత్కరిస్తుంది.
విద్యార్ధులు కూడా ఆ రోజు ( 5, సెప్టెంబర్ ) నాడు తమ టీచర్స్కి సెలవిచ్చి తాము తమ ఇష్టమైన టీచర్ లాగా తయారయ్యి classes తీసుకుంటారు. అలా టి విద్యార్ధులకి ఉత్తమ బహుమతులు ఇవ్వటం, టీచర్స్ కి ఆటల పోటీలు, ఇతర పోటీలు నిర్వహించి బహుమతులు అందచేస్తారు. 




డా || సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ముఖ చిత్రంతో కూడిన స్టాంప్ లను ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది.   
5, సెప్టెంబర్, 1888 న  తమిళనాడు లోని  తిరుత్తణి లో జన్మించారు డా సర్వేపల్లి. భారతీయ అధ్యాత్మిక వేత్తా అయిన వీరాస్వామి, సీతమ్మ దంపతులు వీరి తల్లి తండ్రులు. రాదా కృష్ణన్ శి వ కాముని తన పదహారు సంవత్సరాల ప్రాయం లో వివాహం చేసుకున్నారు. వీరికి 5 కుమార్తెలు, 1 కొడుకు సంతానం. వైస్ చాన్సులేర్ ఆఫ్ ఆంధ్ర యు నివెర్సిటి  లో 1931 నుండి 1936 వరకు వున్నారు. బనారస్ హిందూ ఉనివెర్సితి లోను వైస్ చాన్స్ లర్ గాను వున్నారు.
అనేక విశ్వ విద్యాలయాలల్లో పని చేసిన వీరు ఉపాధ్యా వృతి కే కలికి తురాయిగా వున్నారు. 
వీరు రెండో భారత రాష్ట్రపతిగా 1962 నుంచి 1967 వరకు మొదటి ఉప రాష్ట్రపతిగా 1952 నుంచి 1962 వరకు వున్నారు. యునివర్సిటి  ఆఫ్ కలకత్తాలోను ఆక్స్ ఫోర్డ్ యునివేర్సిటి లోను ప్రోఫేసర్ గాను పని చేసారు. 
 ఉపాధ్యాయ వృతిలో వున్న వీరి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ రోజున టీచర్స్ డే గా జరుపుకుంటున్నాము. వీరి స్నేహితులు, సన్నిహితులు వీరి జన్మ దినాన్ని జరుప తల పెట్టినపుడు వీరు 
"Instead of celebrating my birthday. It would be my proud privilege if 5 September is observed as Teachers' Day"  అని సమాధానం ఇచ్చారు. అప్పటి నుంచి టీచర్స్ డే ని జరుపుకుంటున్నాము 
   

వీరిని భారత రత్న అవార్డు 1954 లో వరించింది. 

వీరి కలం నుంచి ఎన్నో అధ్బుత కల ఖండాలు వెలువడ్డాయి. 
కొన్ని సూక్తులు,  కొటేషన్స్ 
Quotes 
  
"It is not God that is worshipped but the authority that claims to speak in His name. Sin becomes disobedience to authority not violation of integrity."
"Reading a book gives us the habit of solitary reflection and true enjoyment."
"When we think we learn we cease to know."
"A literary genius, it is said, resembles all, though no one resembles him."



డా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర పై యు  ట్యూబ్ లో చిన్న క్లిప్పింగ్ కింద లింక్ లో చూడచ్చు.    



                   http://www.youtube.com/watch?v=awH7qyf_aVY&feature=related


ఉపాధ్యాయుడు తన గురుతర బాధ్యతలో భాగంగా విద్యార్ధులలో విజ్ఞానం తో పాటు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మానవతని, మంచిని, త్యాగాన్ని , ఉద్బోధించాలి . విద్యార్ధులు తమ తెలివి తేటలతో ఏ చిన్న పని చేసిన మెచ్చుకోవాలి. కించపరచకూడదు. తోటివారితో పోలుస్తూ అవమానించకూడదు. టీచర్ విద్యార్ధులకి మంచికి ఆదర్శం గా వుండాలి అలాగని చెడు అలవాట్లలో కాదు. 

ఆదర్శవంతుల జీవితాలని బోధించాలి .
ఇదివరకు బతకలేక బడిపంతులు అనేవారు. నేడు ఆ నానుడికి అర్ధం మారిపోయింది. ఉపాధ్యాయులు అంటే సమజాన్ని నడిపించే దిక్సూచి వంటి వారు. నేటి విద్యార్ధులే రేపటి పౌరులు మొక్కని సరైన పాదు తీసి నీరు పోసి పెంచితే చక్కటి పూలని, ఫలాలని అందిస్తుంది. అలాగే విదుర్దులను చిన్నప్పుడే సరైన  తోవలో నడిపిస్తే వారి భవిష్యత్తు పూల బాటగా మారుతుంది. 
కొంతమంది విద్యార్ధులే తమ టీచర్స్  పై దాడి చేస్తున్న సంఘటనలు పేపర్స్ లో టి వి లలో చూస్తున్నాం. 
గురు బ్రహ్మ: గురు విష్ణు : గురుదేవ్వో మహేశ్వరః 
గురు సాక్షాత్ పర బ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః 
అన్న అర్ధాని రూపు రేఖలు మార్చికొందరు ఆకతాయులు  గురువుల పై తిరగబడే సంఘటనలు జరగటం నిజంగా శోచనీయం.
అలాగే కొన్ని చోట్ల గురువుకి అర్థం మార్చేస్తూ టీచర్నే ప్రేమలోకి దింపే ప్రభుద్దులు తయారవుతున్నారు. వాటికీ తోడూ అలాటి  సినిమాలు రావటం చూస్తుంటే ఈ సమాజ పోకడలు ఎటు పోతున్నాయో అని అనిపిస్తుంది. 
ఈ రోజు డా సర్వేపల్లి రాధాకృష్ణన్ మన దేశానికి ఒక పౌరుడిగా, రాష్ట్రపతిగా , ఉపాధ్యాయుడుగా, విద్యావిధాన నిర్దేశ కుడిగా,  దెశ  భవితని, కీర్తి ప్రతిష్టలని నలు దిశల నడిపిన వ్యక్తి జన్మ దినం జరుపుకుంటున్నాం .
వారి బాటలో ప్రతి ఉపాధ్యాయుడు నడిస్తే నిజంగా మన దేశం నందనవనం గా మారుతుంది.

ప్రభుత్వం ప్రతి ఏట అందించే ఉత్తమ  ఉపాధ్యాయుల అవార్డులని  ఈ సంవత్సరం కూడా నూరు మందికి పైగా అవార్డులు ప్రకటించింది 

నగరం లోని పలు సంస్థలు కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకుంటున్నాయి.
ప్రతివ్యక్తి జీవితంలో గురువు లేనిదే మనుగడ లేదు.
గురువంటే స్చూల్లో  చదువు చెప్పే గురువు కాదు. తల్లి తొలి గురువయితే, విద్య నేర్పే గురువు తరువాత జీవితంలో ప్రతి ఒక్కరు తెలీని విషయం చెప్పే వారు అందరు కూడా గురువులే. ఈ రోజు ఇలా గురువులని స్మరించుకోవడం దేశమంతా అందరు తమకి జ్ఞానం నేర్పిన వారిని గుర్తు చేసుకోవటం నిజంగా సుదినం.