Search

Saturday, May 7, 2016


స్వామి  చిన్మయానంద శత జయంతి  ఉత్సవాలు

    

పూజ్య గురుదేవులు స్వామీ చిన్మయానంద శత జయంతి మే నెల 8వ తారీకున (8.5.2016)   ప్రపంచ మంతా  ఎంతో ఘనంగా జరుపుతున్నారు. 

ఈ సందర్భంగా పూనాలోని చిన్మయ విభూతి  గురించి ....

చిన్మయ విభూతి గురించి స్వామి తేజోమయానంద ఇలా అంటారు

We want people to come here, to derive inspiration, get vision, get training, and then go back and spread this work by doing their best, by lighting up the places to which they go.

- Swami Tejomayananda

   చిన్మయ విబూతి ఆశ్రమం లోపలికి  రాగానే  గేటు  పక్కనే మారుతి   మందిర్ దర్సనమిస్తుంది. ఆశ్రమం  రెండోవేపు చిన్న గుట్ట మీద ప్రణవ్ గణేశుడి  ఆలయం వుంది.  ఇంకా ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న భవన సముదాయాలు .....


Pranav Ganesh,
Maruthi Mandir

 చిన్మయ వాణిపుస్తకాలు, సిడి లు దొరికే షాపు,

చిన్మయ జీవన్దర్శనమ్యుజియం, వున్నాయి  స్వామీ చిన్మయానంద జీవితం తెలిపే పెయింటింగ్స్, స్పీచ్ లు, విగ్రహాలు, ఫోటోలు,  ఉన్నాయి.

అన్నశ్రీ   : 2000 మంది ఒకేసారి భోజనం చేసే విశాలమైన  ప్రాంగణం....

సుధర్మ :  దాదాపు 1008 మందికి పైగా కూర్చుని  వీక్షించే  ఆడిటోరియం

స్వామి సదన్ :  స్వామీజీలు నివసించే కాటేజ్ లు

చిన్మయ్ స్వాగతం : 1000 పైగా ఆశ్రమంలో వుండేలా వసతి సదుపాయాలూ  వున్నాయి. 

 ఆవిర్భావం :

స్వామి  చిన్మయానంద డిసెంబర్ 31, 1951లో  మొట్టమొదటి జ్ఞాన యజ్ఞాన్ని   పూనాలో  ఒక చిన్న గణేశుడి  ఆలయంలో ప్రారంభించారు.  అప్పుడు హాజరు  అయిన వారు కేవలం 18 మంది  మాత్రమే! అది  చిన్మయ  విబూతి (చిన్మయ గ్లోరి) కి  నాంది.  

          తిరిగి అదే  పూనాలోని కొల్వాన్ గ్రామంలో 2012లో ప్రణవ్ గణేశుడి ఆలయం  చిన్మయ విభూతిలో నిర్మించారు. స్వామి తేజోమయానంద, స్వామి బ్రహ్మానంద వినాయకుడి గుడికి కుంభాభిషేకం నిర్వహించారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురుదేవుల ఆశయాలకి అనుగుణంగా తీర్చి దిద్దారు. అధ్యాత్మికతకి నెలవుగా, మానవాళికి  జ్ఞాన బోధనకీ తావుగా, అందమైన ప్రకృతి ఒడిలో కొలువుతీరిన  ఆశ్రమం  చిన్మయ విభూతి.   నేడు ప్రపంచమంతా చిన్మయ మిషన్ ఒక వట వృక్షం గా విస్తరించి ఎంత మందికో జ్ఞాన వీచికలు అందిస్తోంది.

     చిన్మయ విభూతి  కొల్వాన్ గ్రామం లో పునాకి సమీపంలో  సహ్యాద్రి  పర్వతాల నడుమ  65 ఎకరాలలో  విస్తరించి  వుంది.  ప్రపంచమంతా విస్తరించి  వున్న చిన్మయ మిషన్ కి ప్రస్తుతం స్వామి తేజోమయానంద అధ్వర్యంలో వుంది. వీరి  ఆధ్యర్యంలో ఈ ఆశ్రమం నిర్మించ బడింది.  వారు గీతా జ్ఞాన యజ్ఞాలు నిరాటంకంగా  కొనసాగిస్తూ,  గురుదేవ్ ల   ఆశయాలు,  నిస్వార్ధమైన సేవలు, అంకిత భావంతో ప్రజలకి అందిస్తున్నారు. 


చిన్మయ విభూతిగురించి స్వామిని విమలానంద ఇలా అంటారు....

చిన్మయ మిషన్ అనే శరీరానికి అందమైన నెక్లెస్ లాటిది.                                    చిన్మయ జీవన్ దర్శన CJD ఆ నెక్లెస్ కి పెండేంట్   అయితే .                                        పూజ్య గురుదేవ్ ల వాక్స్ విగ్రహం ఆ లాకెట్ లో మెరిసే వజ్రం.”

        Chinmaya Vibhooti is like a beautiful necklace on the body of the Chinmaya Mission. CJD is the pendant of that necklace and Pujya Gurudev’s wax statue in CJD is the shining diamond on that pendant.

        - Swamini Vimalananda, 

చిన్మయ విభూతిలో యువతకోసం, బాలల కోసం కాంప్ లు, ఆచార్యులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటారు,  ఇవే భావాలు  కల ఇతర సంస్థలు, విద్యా సంస్థలు కూడా కాంప్ లు పెడుతుంటాయి.

మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం మొదలైన  ప్రాంతీయ భాష లలో  సాధనా కాంప్ లు అన్ని వయసుల వారికి వుంటాయి.  

చిన్మయ బాల విహార, యువకేంద్ర, శిక్షణా తరగతులు.       స్టడీ గ్రూపులు, చిన్మయ మిషన్  ప్రాజెక్ట్లు, స్వామి  చిన్మయానంద జీవితం గురించి,          వచ్చిన వారు తమ సేవా అనుభవాలు, గైడెన్స్, సలహాలు, ఇంకా అనేక  కార్యక్రమాలపై  చర్చలు, నిర్ణయాలు చిన్మయ విభూతిలో జరుగుతుంటాయి.

అఖిల భారత చిన్మయ యువ కేంద్రాల యూత్ ఎంపవర్మేంట్ (empowerment) కార్యక్రమాలు ....  

చిన్మయ నాదబిందు లో భారతీయ సంగీత నృత్య, నాటక  కార్యక్రమాలు 

ఆచార్యుల సమావేశాలు, సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ సెల్ సెమినార్ లు  ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి

   ప్రపంచ మంతటా విస్తరించిన చిన్మయా మిషన్ వ్యవస్థాపకులు స్వామి చిన్మయానంద నిర్వహించిన గీతా జ్ఞాన యజ్ఞాలు, ఎందరో జీవితాలలో వెలుగులు నింపాయి. సమాజంలోనూ, సంస్కృతులలో, మార్పులు వచ్చాయి. లక్షలాదిమంది శిష్యులు వున్నారు.

       స్వామి చిన్మయానంద శిష్యులు, భక్తులు, లబ్ది పొందినవారు ఈ అందమైన చిన్మయ విభూతిని నిర్మించి గురూజికి అంకితం ఇచ్ఛారు. 

‘We are all beneficiaries of his work, and gratitude is the noblest virtue.’

- Swami Tejomayananda




No comments:

Post a Comment